ENGLISH

‘బుజ్జిగా’డు ఈసారి కొట్టేలానే వున్నాడు.

29 September 2020-16:00 PM

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తోన్న విషయం విదితమే. సినిమా హాళ్లలో చూడాల్సిన సినిమాల్ని, ఇంట్లో కూర్చుని చూడాల్సిన పరిస్థితి వచ్చింది కరోనా కారణంగా. పెద్ద సినిమాలకు ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారితే, చిన్న సినిమాలకు మాత్రం ఓటీటీ కొంత ఉపశమనంగానే కనిపిస్తోంది. ‘ఆహా’ ఓటీటీలో ‘ఒరేయ్‌ బుజ్జిగా’ విడుదలవుతోంది. కాగా, సినిమాపై ప్రీ రిలీజ్‌ బజ్‌ ఒకింత ఆసక్తికరంగా మారింది.

 

ట్రైలర్‌లో బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్‌ కనిపిస్తున్న దరిమిలా, ఆ స్థాయిలో సినిమా అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేసి వుంటే మాత్రం.. ఓటీటీలో ‘ఒరేయ్‌ బుజ్జి’గా సూపర్‌ హిట్‌ అయ్యేందుకు ఆస్కారముంది. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఈపాటికే సినిమాని ది¸యేటర్లలో చూసేసి వుండేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీకి వెళ్ళబోం.. అని కొన్నాళ్ళు ‘ఒరేయ్‌ బుజ్జిగా’ టీం భీష్మించుక్కూర్చున్నా.. చివరికి ఓటీటీలోనే రిలీజ్‌ చేయాల్సి వచ్చింది.

 

అయితేనేం, ప్రీ బజ్‌ బాగానే వుండడంతో.. ఓటీటీ వేదికపై ‘ఒరేయ్‌ బుజ్జిగా’ బాగానే వర్కవుట్‌ అయ్యేలా వుంది. అన్నట్టు, అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఓటీటీలోనే విడుదలవుతోన్న విషయం విదితమే.

ALSO READ: వెంకీని మ్యాచ్ చేయ‌గ‌ల‌డా?