ENGLISH

అమ్మో, అంత రెమ్యునరేషనా?

06 March 2017-18:28 PM

ఓ హీరోయిన్‌కి ఇచ్చేంత రెమ్యునరేషన్‌ ఐటమ్‌ గర్ల్‌కి ఇవ్వవలసి వస్తోంది. 'కరెంట్‌ తీగ' సినిమా కోసమే ఆమెకు చాలా చెల్లించారు. అయితే అందులో ఆమె కొంత నటించడానికి ప్రయత్నించింది. ఆ బ్యూటీ పోర్న్‌ సినిమాలు చేసిన సన్నీలియోన్‌. పోర్న్‌ తారగా ఒకప్పటి తన కెరీర్‌ని సన్నీలియోన్‌ మర్చిపోదు. మర్చిపోయేంత తప్పు చేయలేదని పోర్న్‌ సినిమాల గురించి చెబుతూ బాలీవుడ్‌ తెరపైకి వచ్చాక పోర్న్‌ సినిమాల్లోకి వెళ్ళాలనుకోవడంలేదంటుంది ఆమె. ఆ బ్యూటీ 'కరెంట్‌ తీగ' సినిమాతో బాగానే దండుకుంది. అయితే సినిమాకి ఆమె ఏమాత్రం ఉపయోగపడలేదు. అయినా కూడా ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలో ఇంకో ఆఫర్‌ దక్కిందట. రాజశేఖర్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు రూపొందిస్తున్న సినిమా కోసం సన్నీలియోన్‌ని ఒప్పించారని తెలియవస్తోంది. ఇందు కోసం భారీ రెమ్యునరేషన్‌ ఆమెకు ఆఫర్‌ చేశారట. ఆ రెమ్యునరేషన్‌ హీరో రాజశేఖర్‌ కంటే కూడా ఎక్కువని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అంత చెల్లించి సన్నీలియోన్‌ని ఎందుకు తీసుకురావడం? అని గుసగుసలాడుకుంటున్నారు తెలుగు సినీ రంగంలో. అయితే సన్నీలియోన్‌కి హాట్‌ సెక్స్‌బాంబ్‌గా ఎంతో పేరుంది. అలా ఆమెను తమ సినిమాల్లో చూపించడం ద్వారా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేయవచ్చునని ఆలోచిస్తుండడం వల్లనే ఆమెకు అలా ఛాన్సులొస్తున్నాయి. 

 

ALSO READ: జేజమ్మ అనుష్క మళ్లీనా?