ENGLISH

సుంద‌రానికి డిమాండ్ ఎక్కువే!

16 December 2020-12:00 PM

నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ. త‌న సినిమా కొన్న వాళ్లు, చూసిన వాళ్లూ ఎప్పుడూ ఖుషీనే. సినిమా సినిమాకి త‌న రేంజ్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇది వ‌ర‌కు నాని సినిమా అంటే 25 నుంచి 35 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగేది. ఇప్పుడు నాని బ‌డ్జెట్టే 40 నుంచి 50 కోట్ల‌కు వెళ్లిపోయింది. దానికి త‌గ్గ‌ట్టు త‌న బిజినెస్ కూడా పెరిగిపోయింది.

 

నాని కొత్త సినిమా `అంటే.. సుంద‌రానికి` ఇటీవ‌లే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈసినిమా హ‌క్కుల్ని (నాన్ థియేట‌రిక‌ల్, థియేట‌రిక‌ల్, డిజిట‌ల్‌) జీ 5 ద‌క్కించుకుంది. దాదాపు 55 కోట్ల‌కు డీల్ క్లోజ్ చేసింద‌ని స‌మాచారం. సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే, ఈ స్థాయిలో డీల్ రావ‌డం మామూలు విష‌యం కాదు. ఈ సినిమా బడ్జెట్ 30 నుంచి 40 కోట్ల లోపే. 40 కోట్లు అనుకున్నా, సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే... దాదాపు 15 కోట్ల లాభం సంపాదించుకున్నార‌న్న‌మాట‌.

ALSO READ: సునీత పెళ్లి వాయిదా?