ENGLISH

ఆది సారీ చెప్పాల్సిందేనా?

16 June 2021-11:00 AM

హాస్య న‌టుడు హైప‌ర్ ఆది.. మ‌రోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగ‌మైన బ‌తుక‌మ్మ పాట‌ని ఆయ‌న కించ‌ప‌రిచారంటూ... జాగృతి స్టూడెంట్స్ యూనియ‌న్ ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఓ కామెడీ షోలో హైప‌ర్ ఆది.. బ‌తుక‌మ్మ పాట‌ని పేర‌డీ చేసి, అందులో కామెడీని రాబ‌ట్టాల‌ని ప్ర‌య‌త్నించి విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. బ‌తుక‌మ్మ పాట‌నే కించ‌ప‌రుస్తారా? అంటూ తెలంగాణ వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. హైప‌ర్ ఆదితో పాటు, మ‌ల్లెమాట సంస్థ కూడా... తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్న డిమాండ్ ఎక్కువ అవుతోంది.

 

కామెడీ పేరుతో ఎవ‌రు ఎవ‌రిపైనైనా సెటైర్లు వేయొచ్చు. కానీ సంస్కృతి, సంప్ర‌దాయాలు, భాష‌.. వీటి జోలికి మాత్రం రాకూడ‌దు. ఆ సెగే.. ఇప్పుడు హైప‌ర్ కి త‌గులుతోంది. త‌ప్పు చిన్న‌దో, పెద్ద‌దో జ‌రిగిపోయింది. ఆ త‌ప్పు వ‌ల్ల కొంత‌మంది మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. ఇప్పుడు హైప‌ర్ ఆది ముందున్న మార్గం.. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణలు చెప్ప‌డ‌మే. మ‌రి.. ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి.

ALSO READ: నిర్మాత‌ల‌ను భ‌య‌పెడుతున్న రూమ‌ర్లు