ENGLISH

Hyper Adhi: ఏపీ రాజకీయాలపై హైపర్‌ ఆది జబర్దస్త్ సెటైర్లు

13 January 2023-09:19 AM

ఏపీ రాజకీయాల, మంత్రులపై జబర్దస్త్ హైపర్‌ ఆది సెటైర్లు విసిరారు. మంత్రులకు శాఖలు ఎందుకని.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళంలో జరిగిన సభలో మాట్లాడారు. '' పవన్ కళ్యాణ్‌ను తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకొండి. పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. ఆ శాఖ ఈ శాఖ అని పెట్టుకొని.. శాఖల పరువు తీస్తున్నారు. మీ శాఖల గురించి చెప్పమంటే.. పదో సెకెన్‌లోనే మీరు దొరికిపోతారు. వారాహి యాత్ర ఆపేస్తారా.. ఆయనకి తిక్క రెగితే.. పాదయాత్ర చేస్తారు. అప్పుడు మీకు కాశీ యాత్రే. ఆయన ఇప్పుడు జనసేనానిగా ఉన్నారు.. మీరు ఎక్కువగా విసిగిస్తే.. వీరమల్లు బయటకు వస్తారు'' అంటూ చెలరేగిపోయాడు

 

'ఏ నోటితే అయితే.. మీరు దత్తపుత్రుడు అని అన్నారో.. అదే నోటితో ఆయన అంజనీపుత్రుడు అని అనిపించుకుంటారు. ప్రపంచంలో ప్రతీ ఒక్కడు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని అనుకుంటారు. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసేలా మాట్లాడారా.. ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకొస్తారు'' ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆది.