ENGLISH

ఇలియానానీ... ఎగ‌తాళి చేసిన‌వాళ్లే!

09 March 2021-12:30 PM

గోవా బ్యూటీ ఇలియానా.. పోకిరితో ఎంత‌మంది హృద‌యాల్ని కొల్ల‌గొట్టిందో. త‌న నాజూకు న‌డుమందాల‌కు దాసోహం కాని వారెవరు? అయితే ఒక‌ప్పుడు తాను కూడా బాడీ షేమింగ్ కి గురైంద‌ట‌. త‌న షేపులు చూసి.. చాలామంది ఎగ‌తాళి చేశార్ట‌. ఈ విష‌యాన్ని తానే చెప్పింది. త‌న ఒంట్లోని భాగాల గురించి కొంత‌మంది చుల‌క‌న‌గా మాట్లాడార‌ని `ఇలాఉంటే హీరోయిన్ ని ఎలా అవుతావ్‌` అంటూ.. హేళ‌న చేశార‌ని వాపోయింది ఇలియానా. నిజానికి త‌న‌లో కొన్ని భాగాలు త‌న‌కు న‌చ్చ‌వ‌ట‌. త‌న ఎద భాగం ఓ పెద్ద మైన‌స్ అంటూ... షాకింగ్ కామెంట్లు చేసింది. పైగా త‌న‌పై త‌న‌కు చాలా కాన్షిడెన్స్ త‌క్కువ‌ట‌. ``నేను న‌ల్ల‌గా ఉంటాను. చేతులు స‌న్న‌గా ఉంటాయి. అయితే.. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టేసి, ప్ల‌స్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే బాగుండేది. నా బ్యూటీ స్పాట్ వ‌దిలేసి, లోపాల్ని ఎత్తి చూపేవారు. ఓ విధంగా న‌న్ను చాలా కృంగ‌దీసిన విష‌యం అది`` అంటూ... ఒక్క‌సారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయింది ఇలియానా. త‌న‌లాంటి బ్యూటీకే.. ఇలాంటి విమ‌ర్శలు వ‌చ్చాయంటే.. మిగిలిన‌వాళ్ల సంగ‌తేంటో?

ALSO READ: Ileana Latest Photoshoot