ENGLISH

ఇండియన్ సమురాయ్ గా పవన్

30 August 2024-14:58 PM

ఫాన్స్ అందు పవర్ స్టార్ ఫాన్స్ వేరయా అని చెప్పుకోవాలి. ఫాన్స్ తమ హీరో నుంచి సర్ప్రయిజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఫాన్స్ పవన్ కళ్యాణ్ కి సర్ప్రయిజ్ లు ఇస్తుంటారు. పవన్ ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సామాన్య ప్రజలతో పాటు, సెలబ్రిటీస్  కూడా పవన్  అంటే పడి చస్తారు. హీరోలు కూడా పవన్ కి అభిమానులే. ఏ భాషకి చెందిన వారైనా పవన్ ఫాన్స్ అని చెప్పటం గమనార్హం. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు కావటంతో ఫాన్స్ తమ హీరో మూవీ నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఇక్కడ ఒక అభిమాని పవన్ కి సర్ప్రయిజ్  గిఫ్ట్ ఇచ్చి, తన తోటి ఫాన్స్ ని కూడా సంతోషపెట్టాడు. 


ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్, సినిమాలకి టైం కేటాయించ లేక పోతున్నారు. అందుకే పవన్ సినిమాలు రిలీజ్ కి నోచుకోలేదు. పవన్ కమిట్ అయిన మూవీస్ లో OG పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. ఇందులో  పవన్ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడు. ఇప్పటికే పవన్ లుక్స్  రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ నేపథ్యం లోనే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఫాన్ ఓ చిన్న యానిమేటెడ్ షార్ట్ ఫిలిం చేసాడు. ‘ఇండియన్ సమురాయ్’ అనే పేరుతో ఉన్న ఈ షార్ట్  ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాల్లో తెగ వైరలవుతోంది. 


ఈ యానిమేటడ్ షార్ట్ ఫీల్ లో పవన్ క్యారెక్టర్ సూపర్ గా ఉంది. జపాన్ మార్షల్ ఆర్ట్స్ తో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. సినిమా రేంజ్ లో హీరో ఎలివేషన్స్ ఉండటం విశేషం. పవన్ బర్త్ డే కి ఎలాంటి అప్డేట్ లేదని నిరాశలో ఉన్న ఫాన్స్ కి ఈ షార్ట్ ఫిల్మ్ హుషారు తెచ్చింది. పవన్ ఫాన్స్ తో పాటు మిగతా నెటిజన్స్ కూడా ఈ షార్ట్ ఫిలింని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. దీన్ని డిజైన్ చేసింది 'హ్యారీ కురుకుల' అనే ఫాన్. ఈ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం చేయడానికి కొన్ని నెలలు పట్టిందని వారు పేర్కొన్నారు.