ENGLISH

మ‌హేష్‌, ప‌వ‌న్‌ల కోసం కాద‌ట‌!

01 September 2020-14:30 PM

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `వి` సెప్టెంబ‌రు 5న అమేజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది. నాని, సుధీర్ బాబు న‌టించిన ఓ బుల్లి మ‌ల్టీస్టార‌ర్ ఇది. నిజానికి ఈ సినిమాలో ప‌వ‌న్‌, మ‌హేష్ క‌లిసి న‌టిస్తే ఇంకా బాగుండేద‌ని.. ఓ సంద‌ర్భంలో సుధీర్ బాబునే చెప్పాడు. దాంతో.. ఈ క‌థ మ‌హేష్‌, ప‌వ‌న్ ల కోసం రాసుకుని నాని, సుధీర్ బాబులతో తీస్తున్నారేమో అనిపించింది. వీటిపై ఇప్పుడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ క్లారిటీ ఇచ్చారు.

 

''2006లోనే ఈ క‌థ రాసుకున్నా. ఆ స‌మ‌యంలోనే ఇది నాని, సుధీర్ బాబుల‌కు బాగుంటుంద‌ని అనిపించింది. వాళ్లకే ఈ క‌థ చెప్పా, విన‌గానే వాళ్లూ ఒప్పుకున్నారు. నా మైండ్ లో మ‌హేష్, ప‌వ‌న్‌లు లేరు. ఇది వాళ్ల కోసం రాసుకున్న క‌థ కాదు'' అని స్ప‌ష్టం చేశారాయ‌న‌. పెద్ద హీరోల‌తో సినిమాలు చేసేంత స్కిల్ త‌న‌లో లేద‌ని, వాళ్ల‌తో సినిమా అంటే ఓ భ‌యం వెంటాడుతుంద‌ని, అంత పెద్ద స్పాన్ లో తాను క‌థ‌లు రాయ‌లేన‌ని, అందుకే పెద్ద హీరోల్ని ఎప్పుడూ సంప్ర‌దించ‌లేద‌న్నారు ఇంద్ర‌గంటి.

 

త్వర‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు ఇంద్ర‌గంటి. ఆ సినిమాతో అయినా బిగ్ లీగ్ లోకి చేర‌తారేమో చూడాలి.

ALSO READ: ఆ సినిమాను రెండు నెలల్లోనే పూర్తి చేయనున్న పవన్