ENGLISH

జాతి ర‌త్నాలు... బిజినెస్ బంగారం

08 March 2021-15:00 PM

ఈవారం ఓ మూడు సినిమాలు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. అందులో జాతి రత్నాలు ఒక‌టి. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ ఫేమ్... న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఇదో పూర్తి స్థాయి వినోద భ‌రిత చిత్రం. ఇప్ప‌టికే టీజర్‌, ట్రైల‌ర్ వ‌చ్చేశాయి. అవి ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచేశాయి. దానికి త‌గ్గ‌ట్టే బిజినెస్ ఓ రేంజ్ లో జ‌రిగింద‌ని టాక్‌.

 

ఈ సినిమా థియేట‌రిక‌ల్ రైట్స్ 11 కోట్ల‌కు అమ్మేశార్ట‌. ఈ రైట్స్ రూపంలోనే దాదాపు 4 కోట్ల లాభం వ‌చ్చిన‌ట్టు టాక్‌. అంతేనా? డిజిట‌ల్, శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రూపంలో ఆరు కోట్ల వ‌ర‌కూ వ‌చ్చాయ‌ట‌. అంటే... దాదాపుగా 10 కోట్ల లాభాన్ని నిర్మాత‌లు జేబులో వేసుకున్నార‌న్న‌మాట‌. ఓ చిన్న సినిమా.. ఈ స్థాయిలో బిజినెస్ జ‌రుపుకోవ‌డం నిజంగా గ్రేట్ అనుకోవాలి. మ‌రి సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో?

ALSO READ: ఇంకో నాలుగు పెంచిన నాని