ENGLISH

'జై భీమ్' మూవీ రివ్యూ & రేటింగ్!

02 November 2021-12:34 PM

నటీనటులు: సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రజిషా విజయన్ తదితరులు
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్
సంగీత దర్శకుడు: సీన్ రోల్డన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్


రేటింగ్: 3.25/5


సూర్య స్టార్ ఒక హీరో. స్టార్ ప్రొడ్యుసర్ కూడా. ఆయన నిర్మాణంలో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మంచి కథ అయ్యింటుదనే నమ్మకం. ఇప్పుడు సూర్య నిర్మాణంలో మరో సినిమా వచ్చింది. అదే జై భీమ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే ఆసక్తిపెరింది. ''న్యాయం కోసం కోర్టు లో పోరాడతాను.. అక్కడ న్యాయం జరక్కపొతే రోడ్డు మీదకి వస్తాను. నా పోరాటానికి 'లా' ఒక వెపన్ మాత్రమే''అని ట్రైలర్ లో చెప్పి జై భీమ్ పై మరింత ఆసక్తిని పెంచాడు సూర్య. మరి ఇంతకీ ఈ సినిమాలో ఎలాంటి పోరాటం వుంది ? ఎలాంటి న్యాయం వుంది ? అసలు ఏమిటీ జై భీమ్ కథ..


కథ:


రాజన్న(మణికందన్‌) సినతల్లి (లిజో మోల్‌ జోసే) ఆదివాసీ భార్యభర్తలు. కూలీ పని చేసుకొని బ్రతుకుతుంటారు. ఓ రోజు గ్రామ ప్రెసిడెంట్ ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు వెళ్తాడు రాజన్న. ఆ తర్వాత అదే ఇంట్లో చోరీ జరుగుతుంది. దీంతో పామును పట్టడానికి వచ్చిన  రాజన్ననే ఆ దొంగతనం చేశాడని పోలీసులు అతడిపై కేసు నమోదు చేస్తారు. నేరం ఒప్పుకోమని రాజన్నటప్ పాటు కుటుంబాన్ని కూడా తీవ్రంగా  హింసిస్తారు.


ఇలా హింసించే క్రమ్మలో ఒక రోజు రాజన్న జైలు నుంచి తప్పించుకున్నాడని  సినతల్లికి చెబుతారు.  నిస్సహాయురాలైన రాజన్న భార్య..  మానవ హక్కుల పోరాడే   లాయర్ చంద్రు (సూర్య)ను ఆశ్రయిస్తుంది. ఈ కేసును టేకప్ చేసిన చంద్రుకి ఎదురైన సవాళ్ళు ఏంటి ? రాజన్న ఏమయ్యాడు ? పోలీసు, లాయర్లు ఈ కేసుని ఎన్ని మలపులు తిప్పారు ? చివరికి కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది ? అనేది మిగిలిన కథ.

 

విశ్లేషణ:


ఇది కల్పిత కథ కాదు. రియల్ గా జరిగిన కథ. తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక గిరిజనుడి లాకప్ డెత్ కేసు ఆధారంగా తీర్చిదిద్దుకున్న కథ ఇది. చంద్రు అనే ప్రముఖ మానవహక్కుల న్యాయవాది హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి సుదీర్ఘ కాలం పోరాడి వారికి న్యాయం చేకూరేలా చేసిన సంచలన కేసు. ఆ కేసు పూర్వపరాలని క్షుణ్ణంగా చదివి, అర్ధం చేసుకొని  దర్శకుడు  జ్ఞానవేల్ ‘జై భీమ్’ సినిమాగా తీర్చిదిద్ది విజయం సాధించాడు.


మాయకులైన గిరిజనులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు వేసి , వారు నేరం ఒప్పుకొనేందుకు ఎలాంటి చర్యలకు దిగుతారన్న విషయాలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. జైల్లో సినిమా ఆరంభం అవ్వడమే.. ఆదివాసీ, ఎస్ సీ , ఎస్స్టీ లు ఎలా అణిచివేతకు గురౌతున్నారో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తర్వాత రాజన్న , సినతల్లి కధని మొదలుపెట్టాడు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ఆ కుటుంబాన్ని పోలీసులు అక్రమంగా కేసు పెట్టి ఎలా నాశనం చేశారో చూపించిన విధానం కన్నీళ్లు తెప్పిస్తుంది. నిజానికి పోలీసులు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారో అనే ఆవేదన కలుగుతుంది.  


కేసు చంద్రు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది కోర్టు రూమ్ డ్రామాగా మారుతుంది. చంద్రు ఆధారాలు సేకరించడం, రాజన్న తరపున వాదనలు వినిపించడం .. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతూ రాజన్న కధ కొద్దికొద్దిగా చూపిస్తు రావడం ఆసక్తికరంగా వుంటుంది. ఈ క్రమంలో రాజన్నకి జరిగిన అన్యాయం తెలిసినపుడు ప్రేక్షకుడి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. సుధీర్గమైన సన్నీవేషాలు నడిచే టప్పటికీ ఎక్కడా బోర్ కొట్టించకుండా కధని నడిపించాడు దర్శకుడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి రాజన్న, సినతల్లి పాత్రలని సొంత చేసుకుంటారు. అంతలా ఆ పాత్రలని తీర్చిదిద్దాడు దర్శకుడు.


నటీనటులు:


ఈ సినిమాల ఏకైక స్టార్ సూర్య. అయితే స్టార్ లా కాకుండా చంద్రు అనే పాత్ర గానే కనిపిస్తాడు సూర్య. ఆ పాత్రకు సూర్యని తప్పా ఇంకెవరికి వూహించలేం అంత గొప్ప చేశాడు సూర్య. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు సూర్య.

 

ఇక గిరిజన దంపతులుగా నటించిన మణికందన్‌, లిజో మోల్‌ జోసేలు ఈ సినిమాకి హైలట్. నిజానికి ఇది వారి కధే. మణికందన్‌, లిజో మోల్‌ జోసే లు భార్య భర్తలుగా జీవించారు.  లిజో మోల్‌ జోసే కు ఎక్కువ మార్కులు పడాతాయి. ఆమె చుట్టూనే కధ నడుస్తుంది. ప్రకాశ్‌రాజ్‌, రాజిషా విజయన్‌, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.


టెక్నికల్ గా:


సాంకేతికంగా సినిమా బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అద్భుతంగా పని చేసింది.  ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది.షాన్‌ రొనాల్డ్‌ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సీన్స్ ని ఎలివేట్ చేసింది. నిర్మాణ పరంగా సూర్య రాజీ పడలేదు.


ప్లస్ పాయింట్స్:


సూర్య, రాజన్న, సినతల్లి పాత్రలు
కథ, దర్శకత్వం
డైలాగ్స్ , నేపధ్య సంగీతం  


మైనస్ పాయింట్స్:


కొన్ని చోట్ల స్లో నేరేషన్
కొన్ని చోట్ల  శ్రుతిమించిన హింస


ఫైనల్ వర్డిక్ట్: జై భీమ్.. న్యాయం గెలిచింది.

ALSO READ: చిరు కోసం ప‌వ‌న్ హీరోయిన్‌?