ENGLISH

వామ్మో, జాన్వీ చుట్టూ ఈ పెళ్ళి పుకార్లేంటి.?

06 January 2021-13:22 PM

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెకి పెళ్ళి విషయంలో తొందరేంటి.? మామూలుగా అయితే, అసలు ఆలోచన ఆమెగానీ, ఆమె తండ్రి బోనీ కపూర్‌గానీ చేసే అవకాశమే లేదు. ఎలా పుడుతున్నాయోగానీ, జాన్వీ కపూర్ అతి త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతోందన్న పుకార్లు మాత్రం గట్టిగానే పుట్టేశాయి. తాజాగా ముంబైలో అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసింది జాన్వీ కపూర్. దాని ఖరీదు ఏకంగా 40 కోట్లట. పెళ్ళి ఆలోచనతోనే ఆమె ఈ ఇంటి కొనుగోలు పని పెట్టకుందన్నది బాలీవుడ్‌లో కొన్ని గాసిప్స్ చెబుతున్న మాట.

 

అయితే, దీన్ని సిల్లీ గాసిప్‌గా కొట్టి పారేశారు బోనీ కపూర్. ప్రస్తుతం కెరీర్ విషయమై చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ఫోకస్డ్‌గా జాన్వీ కపూర్ వుందనీ, ప్రేమ గురించిగానీ, పెళ్ళి గురించిగానీ ఆమె ఆలోచించడంలేదనీ, అసలు అలా ఆలోచించే వయసు కూడా ఆమెది కాదనీ బోనీ కపూర్ చెబుతున్నాడట. ఒకప్పుడు పెళ్ళయితే సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయనే భావన వుండేది.

 

కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. పెళ్ళయ్యాక కెరీర్ మరింత వేగంగా ముందుకు సాగుతోంది కొందరి విషయంలో. అలాగని, జాన్వీ కపూర్ అలాంటి చేస్తోందని అనేయలేం. కానీ, నిప్పు లేకుండా పొగ రాదు కదా. ఏమో, సినీ రంగంలో ఏదైనా జరగొచ్చు. ఇంతకీ జాన్వీ మనసులో ఏముందో.? ఈ పుకర్లపై ఆమె ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.

ALSO READ: Janhvi Kapoor Latest Photoshoot