ENGLISH

పెళ్లికి తొంద‌ర‌ప‌డుతున్న జాన్వి

03 August 2021-15:30 PM

శ్రీ‌దేవి కూతురు జాన్వి వ‌య‌సు ఇప్పుడు 24. ఇప్పుడే తాను పెళ్లికి తొంద‌ర‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈమ‌ధ్య త‌ర‌చూ పెళ్లి టాపిక్ ఎత్తుతోంది. నా పెళ్లి ఇలా జ‌ర‌గాలి.. అలా జ‌ర‌గాలి అంటూ... త‌న ఊహ‌ల్ని, ఆలోచ‌న‌ల్నీ, కోరిక‌ల్నీ పంచుకుంటోంది. పెళ్లి కి ముందు త‌న స్నేహితుల‌కు ఐలాండ్ లో ఓ పార్టీ ఇస్తుంద‌ట‌, పెళ్లి మాత్రం తిరుప‌తిలోనే చేసుకుంటుంద‌ట‌. పోస్ట్ వెడ్డింగ్ ఫంక్ష‌న్ ని చెన్నైలో అని ఫిక్స‌యిపోయింది జాన్వీ. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న పెళ్లి ఎలా జ‌ర‌గాలి? అనే విష‌యంపై ఇలా స్పందించింది జాన్వీ.

 

''పెళ్లి రెండు మూడు రోజుల్లో అయిపోవాలి. నా స్నేహితులంతా నా పెళ్లికి రావాలి. ఐలాండ్ లోని ఓ బోట్ లో... వాళ్ల‌కు బ్యాచిల‌ర్ పార్టీ ఇస్తా. చెన్నైలో మా పాత ఇల్లు ఉంది. మా అమ్మ అక్క‌డే ఉండేది. అక్క‌డ‌.. ఫంక్ష‌న్ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తా`` అని చెబుతోంది. జాన్వీ చిట్టా చూస్తుంటే.. ఆల్రెడీ పెళ్లి సంబంధం సెట్ అయిపోయిన‌ట్టు, వ‌రుడు దొరికేసిన‌ట్టే మాట్లాడుతోంది. ఎలాంటి వ‌రుడు కావాలి అని అడిగితే.. ``చాలా సింపుల్.. త‌న‌కు ఆపార‌మైన తెలివితేట‌లుండాలి. ఇంకేం లేక‌పోయినా ఫ‌ర్వాలేదు'' అంటోంది.

ALSO READ: ముగ్గురు వెట‌ర‌న్ హీరోయిన్లు... ఒకే సినిమాలో!