శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు చెబితే.. కుర్రాళ్లకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే... ఇన్ స్టాలో అంత వేడి పుట్టిస్తోంది. తను ఓ కొత్త ఫొటో పెడితే చాలు. దానికి వేలాది లైకులూ, కామెంట్లూ. బికినీ వేసుకుని హాట్ హాట్ గా కనిపించడం ఈమధ్య తన ఫ్యాషన్‌గా మార్చుకుంది. అయితే.. ఇప్పుడు కాస్త శాంతించింది.
కరోనా వేళ కదా. అందుకే ఇంటి పట్టునే ఉంటోంది. ఈమధ్య కొన్ని పెయింటింగ్స్ వేసి, వాటిని అభిమానులతో పంచుకుంది. ఆ కలర్ కాంబినేషన్, స్కెచ్చులూ చూస్తే... పక్కా ప్రొఫెషనల్ ఆర్టిస్టు వేసినట్టే ఉన్నాయి ఆ బొమ్మలు. అవన్నీ చూసి.. జాన్వీలో ఇంత కళ దాగుందా? అని ఆశ్చర్యపోతున్నారంతా. ఈ బొమ్మలతో ఎగ్జిబిషన్ పెట్టొచ్చు కదా.. అని జాన్వికి సలహాలు కూడా ఇస్తున్నారు.
ALSO READ: Janhvi Kapoor Latest Photoshoot