ENGLISH

జాన్వీకి ఎందుకు ఇలా జరుగుతోంది?

03 August 2024-17:26 PM

ఒకప్పటి పాన్ ఇండియా స్టార్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు. స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్  డాటర్. ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ లాంటి కరణ్ జోహార్. ఇన్ని ఉన్నా జాన్వీ కపూర్ కి సరైన గుర్తింపు రావటం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ సంగతి పక్కన పెడితే హిట్టే లేదు. ఏవో  వచ్చాయి వెళ్తున్నాయి అన్నట్టు ఉంటున్నాయి జాన్వీ సినిమాలు కానీ, ఆడియన్స్ ని ఆకట్టుకోవటం లేదు. అందం, అభినయం , ఫిజిక్ అన్ని ఉన్నా ఎందుకిలా తడబడుతోంది అని శ్రీదేవి ఫాన్స్, జాన్వీ ఫాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ శుక్రవారం జాన్వీ నటించిన 'ఉల్జా' మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్న జాన్వీ కి నిరాశే మిగిలింది.


ఉల్జా మూవీ ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేదు. అసలే బాలీవుడ్ కి హిట్ లేదన్న అక్కసుతో సౌత్ సినిమాల్ని విమర్శిస్తూ, బాలీవుడ్ సినిమాల్ని ఆకాశానికి ఎత్తేస్తున్న నార్త్ మీడియా కూడా ఉల్జా కి దారుణమైన రేటింగ్ ఇచ్చింది. జాన్వీ కెరియర్ లో మరో డిజాస్టర్ చేరింది. కావాలని కొందరు 3 రేటింగ్ ఇచ్చినప్పటికీ మెజారిటీ క్రిటిక్స్ 1.5, 2 రేటింగ్స్ ఇచ్చారు. ఉల్జా కంటే ముందు 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' వచ్చింది. ఆ మూవీ కూడా ఎప్పుడు వచ్చిందో ఎపుడు వెళ్లిపోయిందో తెలియదు. అసలిప్పటివరకు  జాన్వీ మూవీస్ థియేటర్స్ లో రిలీజైనవి తక్కువ. ఓటీటీలో రిలీజైనవి ఎక్కువ.


ఇప్పుడు జాన్వీ ఆశాలన్ని టాలీవుడ్ పైనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తో చేస్తున్న 'దేవర' సినిమాపై జాన్వీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేవర చేస్తుండగానే చెర్రీతో  RC 16 లో, నాని తో ఒక మూవీ, బన్నీతో పుష్ప 2 సాంగ్ కమిట్ అయ్యింది. దేవర హిట్ అయితే జాన్వీ సౌత్ లో బిజీ అవుతుంది. లేదంటే ఇక్కడ కూడా జాన్వీ కెరియర్ డౌటే అని చెపొచ్చు.