ENGLISH

జాన్వీ వద్దు బాబోయ్ అంటున్నారు

19 July 2024-12:32 PM

కొన్ని హిట్ కాంబినేషన్లు సినీప్రియులు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు. వారి కెమిస్ట్రీ నచ్చి కొని సార్లు, వారి కలిసి నటిస్తే  హిట్ వస్తుందన్న సెంటి మెంట్ తో ఇంకొందరు అవే కాంబినేషన్స్ ట్రై చేస్తుంటారు కూడా. డైరక్టర్స్, హీరోయిన్స్, టెక్నీకల్ డిపార్ట్ మెంట్స్ అన్నిటిలో ఈ సెంటి మెంట్ ఉంటుంది. ఇపుడు సేమ్ ఇలాగే నాని సినిమాలో మళ్ళీ మళ్ళీ కీర్తి సురేష్ కావాలని అంటున్నారు నాని ఫాన్స్ . నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో  దసరా వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆ పాత్రలో కీర్తిని  తప్ప ఎవర్నీ ఊహించలేము. నాని, కీర్తి పర్ఫెక్ట్ జోడి అనిపించుకున్నారు ఈ సినిమాలో. వీరి కాంబోలో వచ్చిన నేను లోకల్  కూడా సూపర్ హిట్ అయ్యింది.      


ఇప్పుడు మరో సారి నాని, శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. నాని ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారం తర్వాత సుజిత్ తో ఒక సినిమా చేసి, శ్రీకాంత్ మూవీ పట్టాలెక్కించే పనిలో ఉన్నారని సమాచారం. దసరా తరహాలోనే నాని ని డిఫరెంట్ గా చూపించేందుకు శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో నాని పక్కన  హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేసినట్లు టాక్. జాన్వీ ఇప్పటికే దేవరలో నటించింది. నెక్స్ట్ RC16 లో కూడా రామ్ చరణ్ తో నటిస్తోంది. జాన్వీ కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి సెలెక్ట్ చేసినట్లు సమాచారం. 


కానీ శ్రీకాంత్ నిర్ణయం పట్ల నాని ఫాన్స్ సంతోషంగా లేరు. ఈ మూవీలో మళ్ళీ కీర్తి సురేష్ నే తీసుకుంటే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారట. సేమ్ కాంబో అయితే బాగుంటుందని, కేవలం హీరోయిన్ ని మార్చటం ఎందుకని వీరి వాదన. ఈ మూవీకి కీర్తి సురేష్ నప్పినా జాన్వి కపూర్ అయితే కొంచెం హైపు పెరుగుతుందని మేకర్స్ సంశయంలో పడ్డారట . దసరా తర్వాత తెలుగులో ఇంకో సినిమాకి సైన్ చేయలేదు కీర్తి. ఇప్పుడు నాని  ఫాన్స్ డిమాండ్ తో మళ్ళీ దసరా టీమ్ తో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.