ENGLISH

నిర్ణ‌యం మార్చుకున్న జీవిత‌.. కార‌ణ‌మేంటి?

06 February 2021-18:02 PM

రాజ‌శేఖ‌ర్ కొత్త చిత్రంం `శేఖ‌ర్‌`కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌య్యాయి. ఈ సినిమాకి ల‌లిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. మ‌ల‌యాళ చిత్రం `జోసెఫ్‌` కి ఇది రీమేక్‌.నిజానికి నీల‌కంఠ చేయాల్సిన సినిమా ఇది. సృజ‌నాత్మ‌క విబేధాల వ‌ల్ల నీల‌కంఠ ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. దాంతో...క్రిష్‌, కృష్ణ‌వంశీల ద‌గ్గ‌ర ప‌ని చేసిన ల‌లిత్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు.

 

ఓ ద‌శ‌లో ఈ సినిమాకి జీవిత‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని ఫిక్స‌య్యారు. ఈ విష‌య‌మై మీడియాలో కూడా వార్త‌లొచ్చాయి. అయితే... చివ‌రి నిమిషంలో జీవిత డ్రాప్ అయ్యార‌ని తెలుస్తోంది. నిర్మాత‌గానూ, జీవిత సినిమా ప్రొడక్ష‌న్ వ్య‌వ‌హారాలు చూసుకోవాల్సి రావ‌డంతో, బాధ్య‌త‌లు ఎక్కువ అవ్వ‌కూడ‌ద‌ని భావించి, ద‌ర్శ‌క‌త్వాన్ని ప‌క్క‌న పెట్టార‌ని తెలుస్తోంది. కాక‌పోతే... ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ మాత్రం ఆమెనే చూస్తార‌ని స‌మాచారం అందుతోంది.

ALSO READ: 'ఆచార్య‌'.. ఇంట్ర‌వెల్‌కి దిమ్మ‌తిరిగిపోవ‌డం ఖాయం