ENGLISH

మేము ఎలాంటి తప్పు చేయలేదు : జీవిత

23 April 2022-18:02 PM

''నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, నా తప్పు లేకపోతే దేవుడ్ని కూడా ధైర్యంగా నిలదీస్తా'అన్నారు జీవిత. తనపై వచ్చిన ఆరోపణలపై జీవిత స్పందించారు. ‘శేఖర్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె ఈ కేసు గురించి మాట్లాడారు. సుమారు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని, ఇప్పుడు వాళ్లు ప్రెస్‌మీట్‌ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవాలు లేవని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

 

‘‘జోస్టార్స్‌ ప్రొడెక్షన్‌కు సంబంధించి కోర్టులో రెండు నెలల నుంచి కేసు నడుస్తోంది. వాళ్లు ఇప్పుడెందుకు మీడియా ముందుకు వచ్చారో నాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే వారెంట్‌ వచ్చింది. నాకెలాంటి సమన్లు అందలేదు. మా గౌరవానికి భంగం కలిగించడం ఎవరి తరం కాదు. నేను దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అయితే యూట్యూబ్‌లో కొంతమంది క్రియేట్‌ చేస్తోన్న థంబ్‌నేల్స్‌ చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. దయచేసి ఇలా ఇష్టం వచ్చినట్లు థంబ్‌నేల్స్‌ పెట్టి మాకు ఇబ్బంది కలిగించకండి’’ అని కోరారు జీవిత.

ALSO READ: ఆచార్య ఈవెంట్ లో మెగా ప్రకటన