ENGLISH

గ్లామ్‌ షాట్‌: నటనే కాదు, హీటెక్కించడంలోనూ 'శ్రద్ధ'గానే!

26 April 2019-10:30 AM

కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్‌ తన తొలి తెలుగు సినిమాతోనే బంపర్‌ విక్టరీ అందుకుంది. నటనలో మంచి మార్కులేయించుకుంది. తన నటకు మంచి అప్లాజ్‌ లభిస్తుందంటే సినిమా రిలీజ్‌కి ముందే 'నా పేరు గుర్తుపెట్టుకోండి' అన్నట్లు ఒకటికి పదిసార్లు తన పేరు గట్టిగా చెప్పుకుంది శ్రద్ధా శ్రీనాథ్‌. సినిమా రిలీజయ్యాక, ఆమె నటన గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే వున్నాం. కన్నడలో 'యూ టర్న్‌' సినిమాతో హిట్‌ అందుకున్న శ్రద్ధ, ప్రస్తుతం తమిళ సినిమా 'కె13' సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తోంది. 

 

'నేర్కోండపారవై' అనే తమిళ సినిమాలోనూ నటిస్తోందిప్పుడు. నటన మాత్రమే కాదు, గ్లామర్‌లోనూ 'శ్రద్ధ' ఎక్కువేనని ఇదిగో ఈ ఫొటోతో చెప్పకనే చెబుతోంది శ్రద్ధా శ్రీనాథ్‌. నటనకు గ్లామర్‌ తోడైతే ఆ కిక్కే వేరప్పా.. అని బహుశా ఇలాంటి అందాల భామల్ని చూస్తేనే అన్పిస్తుందేమో. అన్నట్టు, ఫొటోలోనూ అందాల విందు కంటే, కళ్ళతోనే ఆ హాట్‌ అప్పీల్‌ని సీరియస్‌గా పండించేసింది శ్రద్ధా శ్రీనాథ్‌. 'యూటర్న్‌' తెలుగు సినిమాకి సంబంధించి సమంతపై శ్రద్ధ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమయినా, 'జెర్సీ' హిట్‌ తర్వాత ఆ వివాదం అటకెక్కిన సంగతి తెల్సిందే. 

ALSO READ: ఆ ఆంటీతో పెళ్లి ఇప్పుడప్పుడే కాదట.!