శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని తెలుగు తెరపై చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. జాన్వీకి కూడా చాలా అవకాశాలు వచ్చాయి.కానీ... ఏదీ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమా ఓకే చేసింది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీని ఎంచుకొన్నారు.
అయితే ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజు జాన్వీ కపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం నుంచి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాలో జాన్వీ నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తన పుట్టిన రోజున. ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ అఫీషియల్‌గా టాలీవుడ్ లో అడుగుపెట్టేసిందన్నమాట. ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఆస్కార్ వేడుకల్లో ఎన్టీఆర్ పాలు పంచుకోనున్నాడు. ఆ హడావుడి అయిపోయిన వెంటనే ఇండియాకి తిరిగొస్తాడు. ఆ తరవాత.. ఎన్టీఆర్ - కొరటాల సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.