ENGLISH

ప్ర‌భాస్‌ని ఢీ కొట్ట‌నున్న జాన్ అబ్ర‌హాం

07 January 2021-12:01 PM

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో పాన్ ఇండియా సినిమా `స‌లార్‌`. కేజీఎఫ్ తో ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌కి మోహ‌న్ లాల్ ని ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు జాన్ అబ్ర‌హాం లైన్ లోకి వ‌చ్చాడు. ఈసినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా జాన్ అబ్ర‌హాంని ఎంచుకున్నార‌ని టాక్‌. ప్ర‌శాంత్ నీల్ టీమ్ జాన్ తో.. సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని, త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యానికి రావొచ్చ‌ని తెలుస్తోంది.

 

ఈ నెల‌లోనే `స‌లార్‌`ని లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. క‌నీసం 10 రోజుల పాటు షూటింగ్ జ‌ర‌పాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. `రాధేశ్యామ్` అయ్యాక‌.. `స‌లార్‌` షూటింగ్ కంటిన్యూ అవుతుంది. `స‌లార్‌` కోసం ఆడిష‌న్స్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆడిష‌న్స్ ద్వారా మ‌రికొంత‌మందిని ఎంచుకున్నారు. వీళ్లంద‌రి వివ‌రాలూ త్వ‌ర‌లోనే చిత్ర‌బృందం ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.

ALSO READ: `జ‌బ‌ర్‌ద‌స్త్‌`లోకి నాగ‌బాబు రీ ఎంట్రీ?