ENGLISH

'లవ'కుమార్‌ ఎలా ఉంటుంది టీజర్‌?

23 August 2017-15:48 PM

'జై లవకుశ' నుండి మరో టీజర్‌ రాబోతోంది. 'జై' పాత్రని పరిచయం చేస్తూ రిలీజైన మొదటి టీజర్‌ ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు మరో ప్రభంజనానికి ఎన్టీఆర్‌ రెడీ అయిపోతున్నాడు. లవకుమార్‌ పాత్రని పరచయం చేస్తూ ఓ టీజర్‌ రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ టీజర్‌ రాబోతోంది. ఆల్రెడీ 'లవకుమార్‌' ఫస్ట్‌లుక్‌ రిలీజయ్యింది. చాలా కూల్‌గా సాఫ్ట్‌గా ఉంది ఆ లుక్‌. ఇప్పుడు రాబోయే టీజర్‌లో లవకుమార్‌ పాత్రని ఇంట్రడ్యూస్‌ చేయడంతో పాటు, కొన్ని ఇంపార్టెంట్‌ డైలాగ్స్‌, డాన్సు స్టెప్పులు కూడా ఉండబోతున్నాయనీ సమాచారమ్‌. ఇక సినిమా విడుదలకు అతి కొద్ది టైమ్‌ మాత్రమే ఉంది. అంటే మూడో పాత్రని కూడా వెంటనే రిలీజ్‌ చేయనున్నారట చిత్ర యూనిట్‌. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రమిది. మూడు గెటప్స్‌లో ఎన్టీఆర్‌ తొలిసారిగా నటిస్తున్న చిత్రమిది. హాలీవుడ్‌ స్థాయి మేకప్‌ అసిస్టెంట్స్‌ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. ఎన్టీఆర్‌ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నారన్న సంగతి 'జై' పాత్ర టీజర్‌ ద్వారా స్పష్టమైంది. ఇక సాప్ట్‌ క్యారెక్టర్‌ లవకుమార్‌ అని తెలిసింది. ఇక ముచ్చటగా మూడో పాత్ర ఎలా ఉండబోతోందో అనే విషయం కూడా మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ALSO READ: మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి