ENGLISH

ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించనున్న కాజల్‌ అగర్వాల్‌.

04 September 2020-13:00 PM

కాజల్‌ అగర్వాల్‌ నిర్మాతగా మారబోతోందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ‘అ’ సినిమా విషయంలోనే ఆమె నిర్మాణ పరంగా కొంత రిస్క్‌ తీసుకోవాలనుకుందట. కానీ, కొన్ని కారణాలతో వెనక్కి తగ్గిందని చెబుతుంటారు. ఇక, ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ నిర్మాతగా మారబోతోందనే ప్రచారం ఇంకాస్త గట్టిగా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో కాజల్‌ అగర్వాల్‌, తన సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి సినిమా నిర్మాణంపై చాలా రీసెర్చ్‌ చేసేసిందట. నిషా కూడా గతంలో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన విషయం విదితమే.

 

కాజల్‌ అగర్వాల్‌ ఇంకా పెళ్ళి గురించిన ఆలోచన చేయడంలేదుగానీ, నిషా మాత్రం ఆల్రెడీ పెళ్ళి చేసేసుకుని లైఫ్‌లో సెటిలైపోయింది. దాంతో, ఆమె కూడా తనకూ సినీ రంగంలో ఓ వ్యాపకం వుండాలని భావిస్తోందట. చెల్లెలంటే అమితమైన ప్రేమ గల కాజల్‌ అగర్వాల్‌, చెల్లితో కలిసి ఓ నిర్మాణ సంస్థని అనౌన్స్‌ చేయబోతోందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే, తొలుత ఈ నిర్మాణ సంస్థలో ఓ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నారట. తెలుగులోనే ఆ వెబ్‌ సిరీస్‌ వుండబోతోందని సమాచారం.

 

ఇక, కాజల్‌ సినిమాల విషయానికొస్తే, తెలుగులో ‘ఆచార్య’ కోసం మెగాస్టార్‌తో మరోమారు జోడీ కట్టబోతోంది. తమిళంలో మాత్రం నాలుగైదు సినిమాలున్నాయి కాజల్‌ అగర్వాల్‌కి. అందులో ‘భారతీయుడు-2’ కూడా ఒకటి. మరోపక్క కాజల్‌ నటించిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ సినిమా విడుదల కావాల్సి వుంది. ఇది బాలీవుడ్‌ సినిమా ‘క్వీన్‌’కి రీమేక్‌.

ALSO READ: ప్ర‌భాస్ విల‌న్ వీకైపోయాడేంటి?