ENGLISH

హీరోయిన్స్‌లో కాజల్‌ నెంబర్‌ వన్‌ ఇది నిజమేనా.?

05 December 2018-07:30 AM

సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్స్‌ లిస్టులో కాజల్‌ నెంబర్‌ వన్‌ అని చర్చించుకుంటున్నారు. 'ఇండియన్‌ 2' చిత్రాన్ని డైరెక్టర్‌ శంకర్‌ అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌ కాబట్టి, హీరోయిన్‌గా కాజల్‌కి కూడా ఎక్కువ రెమ్యునరేషన్‌ ఉండొచ్చు. ఇంతవరకూ సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్స్‌లో సౌత్‌ క్వీన్‌ నయనతార, స్వీటీ బ్యూటీ అనుష్క ముందంజలో ఉండగా, వారిద్దరినీ మించిన రెమ్యునరేషన్‌ ఇండియన్‌ 2' సినిమాతో కాజల్‌ అందుకోబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.

ఇది నిజమైతే సౌత్‌లో అధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్స్‌లో కాజల్‌ మొదటి ప్లేస్‌లో ఉంటుందనడం ఖాయం. రెమ్యునరేషన్‌ సంగతి పక్కన పెడితే, 'ఇండియన్‌ 2'లో ఛాన్స్‌ దక్కించుకోవడం కాజల్‌కి నిజంగా బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంటే అని చెప్పాలి. టాలీవుడ్‌లో మెగాస్టార్‌ 150వ చిత్రం 'ఖైదీ నెం 150' అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం. ఈ చిత్రంలో మెగాస్టార్‌ సరసన నటించే అదృష్టం ఏ ముద్దుగుమ్మని వరిస్తుందా అని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సడెన్‌గా కాజల్‌ పేరు తెరపైకి వచ్చింది.

రావడమే కాదు, జగదేకవీరుడు మెగాస్టార్‌ రీ ఎంట్రీ మూవీలో మొట్టమొదటి హీరోయిన్‌గా కాజల్‌ ది బెస్ట్‌ మెమరీని సొంతం చేసుకుంది. ఇక విశ్వనటుడు కమల్‌ హాసన్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఛాన్స్‌ అంటే కూడా అలాగే భావించాలి. ఈ ఛాన్స్‌ కొట్టేసిన చందమామ ఆనందంతో ఉరకలేసేస్తోందట. ప్రస్తుతం తెలుగులో కాజల్‌ యంగ్‌ హీరో బెల్లంకొండతో రెండు సినిమాల్లోనూ, తమిళంలో 'క్వీన్‌' రీమేక్‌ 'ప్యారిస్‌ ప్యారిస్‌'లోనూ నటిస్తోంది.

ALSO READ: 'భారతీయుడు' కోసం అక్షరాలా వెయ్యి కోట్లట.!