ENGLISH

కాజల్‌ హైద్రాబాద్‌కి వచ్చేస్తోందా?

05 November 2020-12:00 PM

నెల రోజులపాటు ఏకబిగిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ జరగబోతోందట. మరి, కాజల్‌ అగర్వాల్‌ పరిస్థితి ఏంటి.? కొద్ది రోజుల క్రితమే ఆమె పెళ్ళి జరిగింది. పెళ్ళి పనుల హంగామా, తదనంతర కార్యక్రమాల్లో బిజీగా వున్న కాజల్‌ కూడా అతి త్వరలోనే ఆ పనులన్నిటినీ చక్కబెట్టేసి, హైద్రాబాద్‌కి వచ్చేయబోతోందట. ఈ విషయమై ఇప్పటికే ‘ఆచార్య’ బృందంతో కాజల్‌ అగర్వాల్‌ మంతనాలు జరిపిందనీ, కాజల్‌తో ‘ఆచార్య’ బృందానికి ఎలాంటి గ్యాప్‌ లేదనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా, డిసెంబర్‌ చివరి నాటికి సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయిపోవచ్చని తెలుస్తోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కోసం కొంత సమయం తీసుకోవడం తప్పనిసరి. మరోపక్క, పాటల చిత్రీకరణ విషయంలోనూ కొంత కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతోంది. ఎలా చూసుకున్నా, నవంబర్‌ తర్వాత కాజల్‌ పూర్తిగా ‘ఆచార్య’ బృందంతోనే వుండాల్సి వస్తుంది. కాగా, కాజల్‌ తన భర్తని గౌతంని కూడా హైద్రాబాద్‌ తీసుకురాబోతోందనీ, హైద్రాబాద్‌లోని సినీ ఫ్రెండ్స్‌కి పెద్ద పార్టీ ఇవ్వబోతోందనీ ప్రచారం జరుగుతోంది. మరోపక్క, కాజల్‌ తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాల షూటింగుల పునఃప్రారంభంపై మాత్రం ప్రస్తుతానికి కొంత అయోమయం కొనసాగుతోంది. ఇక, కాజల్‌ - చిరంజీవి కాంబినేషన్‌ విషయానికొస్తే, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ఖైదీ నెంబర్‌ 150’ సూపర్‌ హిట్‌ అయిన విషయం విదితమే.

ALSO READ: Kajal Latest Photoshoot