ENGLISH

ఎట్టకేలకు కాజల్‌ 'ఆ పని' పూర్తి చేసేసింది

28 December 2020-13:12 PM

పెళ్ళికి ముందు ఒప్పుకున్న సినిమాల్ని, పెళ్ళయ్యాక చకచకా పూర్తి చేసేసే పనిలో బిజీగా వుంది కాజల్‌ అగర్వాల్‌. ఇంకోపక్క కొత్త ప్రాజెక్టుల్ని కూడా టేకప్‌ చేసేస్తోంది. తాజాగా 'హే సినామికా' పేరుతో తమిళంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేసుకుంది కాజల్‌. ప్రముఖ డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ బృందా గోపాల్‌ దర్శకురాలిగా మారి తీస్తోన్న సినిమా ఇది. తమిళంతోపాటు, తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట.

 

'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమాలో హీరో. అదితి రావు హైదరి మరో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. ఈ సినిమాలో తనది చాలా విలక్షణమైన పాత్ర అని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. బృందా గోపాల్‌ దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా వుందని అందాల చందమామ చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే, కాజల్‌ తెలుగులో 'మోసగాళ్ళు', 'ఆచార్య' సినిమాల్లో నటిస్తోన్న విషయం విదితమే. 'ఆచార్య'లో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తోంది కాజల్‌.

 

చిరంజీవితో ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా. మరోపక్క, తమిళంలోనూ, కాజల్‌ అగర్వాల్‌ మూడు సినిమాలు చేస్తోంది. 'నటనకు పెళ్ళి అడ్డంకి కాదు. వైవాహిక జీవితాన్నీ, యాక్టింగ్‌ కెరీర్‌ని బ్యాలెన్స్‌ చేసుకోగలననే నమ్మంక వచ్చాకనే పెళ్ళి చేసుకున్నాను..' అని కాజల్‌ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం విదితమే.

ALSO READ: Kajal Latest Photoshoot