ENGLISH

కళ్యాణ్‌రామ్‌ '118' కాక పుట్టించాడు.!

03 December 2018-11:46 AM

జయాజయాల సంగతెలా ఉన్నా, కొత్తదనంతో కూడిన ఆలోచనలు చేయడంలో కళ్యాణ్‌రామ్‌ది ప్రత్యేకమైన శైలి. ఏ సినిమా చేసినా కొత్తగా ఉండాలనుకుంటాడు. ఈ క్రమంలో ఫెయిల్యూర్స్‌ వచ్చినా, లెక్క చేయడు. నిర్మాతగా, నటుడిగా ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలకే పెద్ద పీట వేస్తుంటాడు. ఈ మధ్యనే 'నా నువ్వే' లాంటి విలక్షణ సినిమా చేసిన కళ్యాణ్‌రామ్‌, ఆ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ సారి కూడా మరో ప్రయోగాత్మక సినిమాకి శ్రీకారం చుట్టాడు.

 

అదే '118'. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. లేటెస్టుగా ఈ సినిమా నుండి టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. 118 నెంబర్‌లో కళ్యాణ్‌రామ్‌ స్టైలిష్‌గా కనిపిస్తున్నట్లున్న ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాలో ప్రతీక్షణం సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకున్ని తెలియని థ్రిల్లింగ్‌ అనుభూతికి లోనయ్యేలా చేస్తాయట. పవర్‌ఫుల్‌ కథతో అండ్‌ డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో కనిపించబోతున్నాడట. కె.వి.గుహన్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

 

ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ ఈ '118'ని నిర్మిస్తోంది. కళ్యాణ్‌రామ్‌ సరసన నివేదా థామస్‌, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నివేదా థామస్‌ కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన 'జై లవకుశ' సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక షాలినీ పాండే 'అర్జున్‌రెడ్డి' తర్వాత ఈ సినిమాలో అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రని పోషిస్తోందట. 'అర్జున్‌రెడ్డి' తర్వాత 'మహానటి' సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించింది. తమిళంలో '100 పర్సెంట్‌ కాదల్‌'లో నటిస్తోంది.

ALSO READ: స్టార్ హీరోల‌పై త‌మ‌న్నా సెటైర్లు