ENGLISH

న‌యా రావ‌ణ్‌... క‌మింగ్ సూన్‌!

05 January 2021-14:02 PM

కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలో ఎప్పుడూ ముందే ఉంటాడు క‌ల్యాణ్ రామ్‌. సురేంద‌ర్ రెడ్డి, అనిల్ రావిపూడి లాంటి ద‌ర్శ‌కుల్ని ఆయ‌నే ప‌రిచ‌యం చేశాడు. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కుల‌కు ఛాన్సులిచ్చాడు. అందులో వ‌శిష్ట ఒక‌డు. వ‌శిష్ట క‌ల్యాణ్ రామ్ కోసం ఓ క‌థ రెడీ చేశాడు. ఈ చిత్రానికి `రావ‌ణ‌` అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో క‌ల్యాణ్‌రామ్ పాత్ర నెగిటీవ్ ట‌చ్‌లో ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నిర్మాత కూడా క‌ల్యాణ్ రామే. ఈ సినిమా కోసం క‌ల్యాణ్ రామ్ జుత్తు, గెడ్డం బాగా పెంచారు. రావ‌ణ లుక్ లోకి పూర్తిగా మారే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

 

దీంతో పాటు `తుగ్ల‌క్‌` అనే మ‌రో క‌థ‌నీ క‌ల్యాణ్ రామ్ ఓకే చేశారు. ఇది సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే క‌థ‌. వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈసినిమాలో క‌థానాయిక‌గా కేథ‌రిన్ ని ఖ‌రారు చేసిన‌ట్టు టాక్‌. అయితే తుగ్ల‌క్ కంటే ముందు.. రావ‌ణ‌నే సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ని తెలుస్తోంది.

ALSO READ: ప‌వ‌న్ పై గురి పెట్టాడు