ENGLISH

హ్రితిక్ గుట్టు విప్పిన కంగనా?!

04 September 2017-11:29 AM

పోయిన ఏడాది బాలీవుడ్ లో సంచలనం రేపిన హ్రితిక్-కంగనాల మెయిల్స్ వివాదం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ఒక ప్రముఖ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నటి కంగనా తన ప్రేమ వ్యవహారాల పైన అలాగే హీరో హ్రితిక్ తనని ఎలా మోసం చేశాడు అన్న దాని పైన సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక హ్రితిక్ తన భార్య తో కలిసి ఉండగానే తనని ఇష్టపడ్డాడు అని అయితే తనకోసం తన భార్యని వదిలేయలేకపోయాడు అంటూ చెప్పింది.

కాని కొన్నిరోజుల తరువాత, తనని కావాలని పక్కన పెట్టాడు అని, అదేంటి అని ప్రశ్నించగా క్వీన్ సినిమాతో నాకు తలపోగరు పెరిగింది అంటూ బదులు ఇచ్చాడు అని చెప్పుకొచ్చింది. ఇక హ్రితిక్ ని ‘సిల్లీ ఎక్స్’ అంటూ సంబోదించడం అలాగే హ్రితిక్ తండ్రి అయిన రాకేశ్ రోషన్ తనని ఈ కేసులో ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది కూడా బయటపెట్టింది.

ఈ కామెంట్స్ విన్న హ్రితిక్ మాత్రం- తాను పొప్ తో నైనా డేటింగ్ చేస్తాను కాని కంగనా తో మాత్రం చేయను అని ట్వీట్ చేశాడు. ఇక హ్రితిక్ మాజీ భార్య కూడా ఈ విషయంలో హ్రితిక్ కే మద్దతు పలికింది.

 

ALSO READ: హైదరాబాద్ లో తనకి ఒక డ్రీం ఉందన్న తాప్సీ