ENGLISH

ప్రభాస్ సినిమాలో కరీనా?

11 May 2024-18:21 PM

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ దర్శనమిస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు విలన్స్ గా మారుతున్నారు. ఒకప్పడు తెలుగు సినిమాల్లో నటించటానికి నో చెప్పిన బాలీవుడ్ భామలు ఇప్పుడు గెస్ట్ రోల్, ఐటమ్ సాంగ్స్ కూడా చేయటానికి రెడీ అవుతున్నారు. కారణం తెలుగు సినిమా స్థాయి పెరగటమే అని గర్వంగా చెప్పొచ్చు. గత ఏడాది ప్రభాస్ సలార్ పార్ట్ వన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర కొన్ని కోట్లు కొల్లగొట్టాడు. అదీ డార్లింగ్ రేంజ్. నెక్స్ట్ కల్కి తో రాబోతున్నాడు. సలార్ పార్ట్ 2 కూడా  షూటింగ్ మొదలయ్యింది. మొదటి పార్ట్ లోనే అన్ని భాషలకి చెందిన నటీ నటులున్నారు. సెకండ్ పార్ట్ లో ఇంకా కొంతమంది యాడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాడింగ్స్ లో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. 


సలార్ 2 లో కరీనాని నటింప చేయాలనీ దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో కరీనా అయితే బాగుంటుందని నీల్ ఆలోచన. పెళ్లి, పిల్లల తరవాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కరీనా రీసెంట్ గా బాలీవుడ్ 'క్రూ' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అడపా దడపా సినిమల్లో నటిస్తూనే ఉంది. బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో కరీనా కి సౌత్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఆమె ఇంట్రస్ట్ చూపలేదు. కానీ ఇప్పడిప్పుడు సౌత్ సినిమాలపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే యశ్ టాక్సిక్ మూవీలో కరీనా నటిస్తోంది. యశ్ కి సిస్టర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సలార్ 2 లో నటించే అవకాశం ఉంది. 


సలార్ 2 లో కరీనా పాత్ర ఎలా ఉండనుందో తెలియాల్సి ఉంది.  ఆ పాత్ర సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ రెండు సినిమాల తరవాత కరీనా మరిన్ని సౌత్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించే ఛాన్స్ ఉంటుంది. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా  నటించినా ఆశ్చర్య పోనవసరం లేదు. కరీనాకి ఉన్న క్రేజ్ అలాంటిది.