ENGLISH

మ‌రో ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చిన ర‌వితేజ‌

18 June 2022-11:00 AM

ఏ హీరో ద‌గ్గ‌ర కాల్షీట్లు ఉన్నా లేకున్నా, ర‌వితేజ ద‌గ్గ‌ర మాత్రం గంప‌గుత్త‌గా ఉంటాయి. నిర్మాత ఓకే అంటే చాలు. ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర ఓ క‌థ ఉంటే చాలు. చేయ‌డానికి ర‌వితేజ ఎవ‌ర్ రెడీ. త‌న ద‌గ్గ‌ర క‌నీసం అర‌డ‌జ‌ను ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా కొత్త‌వి ఒప్పుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మ‌రోటి కూడా చేరింద‌ని స‌మాచారం.

 

సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని తెలుసు క‌దా? కార్తికేయ‌, ఎక్స్‌ప్రెస్ రాజా, నిన్ను కోరి, చిత్ర‌ల‌హ‌రి లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ప‌నిచేశాడు. టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న కెమెరామెన్‌. తాను సినిమా ఒప్పుకున్నాడంటే హిట్టే అనే న‌మ్మ‌కం జ‌నాల్లో ఉంది. త‌న‌కెప్ప‌టి నుంచో.. డైర‌క్ష‌న్ పై గురి. ఓ క‌థ త‌యారు చేసుకొని హీరోల్ని ఒప్పించుకొనే ప‌నిలో బిజీగా తిరుగుతున్నాడు. త‌ను ర‌వితేజ‌కు ఓ క‌థ చెప్పాడ‌ని, అది ర‌వితేజ‌కు న‌చ్చేసింద‌ని టాక్‌. ర‌వితేజ ఓకే అంటే.. సినిమా చేయ‌డానికి చాలామంది నిర్మాత‌లు రెడీ. పైగా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని తొలి సినిమా కాబ‌ట్టి... ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్రేజ్ ఉంటుంది. నిర్మాత దొరుకుతాడా, లేదా? అనే విష‌యాల‌పై ఎలాంటి అనుమానాలూ లేవు. కాక‌పోతే... ఈ ద‌ర్శ‌కుడికి ర‌వితేజ కాల్షీట్లు ఎప్పుడు స‌ర్దుబాటు చేస్తాడ‌న్న‌దే ప్ర‌శ్న‌.

ALSO READ: ఫ్లాఫ్ ఇచ్చిన దర్శకుడికే పచ్చజెండా.. దటీజ్ రజనీ