ENGLISH

ప‌ద‌కొండేళ్ల ప్రేమ‌.. పెళ్లి పీట‌లెక్కుతోంది

24 August 2021-14:00 PM

ఈమ‌ధ్య కార్తికేయ నిశ్చితార్థ వేడుక గ‌ప్ చుప్ గా జ‌రిగిపోయింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో బ‌య‌ట‌కు రావ‌డం మిన‌హా.. ఆ వివ‌రాలేం జ‌నాల‌కు తెలియ‌దు. దాంతో... ఆ అమ్మాయి ఎవ‌రు? ఏం చేస్తుంటుంది? ఇది ప్రేమ పెళ్లా? పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా? అంటూ ర‌క‌ర‌కాల ఆరాలు మొద‌లైపోయాయి. వాటికి కార్తికేయ పుల్ స్టాప్ పెట్టేశాడు. త‌మ‌ది ప్రేమ వివాహం అని క్లారిటీ ఇచ్చేశాడు. ఆ అమ్మాయి పేరు లోహిత అంటూ.. రివీల్ చేశాడు. 2010లో వీరిద్ద‌రి ప‌రిచ‌యం జ‌రిగింద‌ట‌. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు.

 

త‌ర‌వాత ప్రేమ‌లో ప‌డ్డారు. ఇప్పుడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ``2010లో నిట్ వరంగల్ లో తొలిసారి లోహితను కలిశాను. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది'' అని కార్తికేయ చెప్పుకొచ్చాడు. పెళ్లెప్పుడో చెప్ప‌లేదు గానీ, అతి త్వ‌ర‌లోనే ఉండ‌బోతోంద‌ని స‌మాచారం అందుతోంది. ప్ర‌స్తుతం `రాజా విక్ర‌మార్క‌` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కార్తికేయ‌. ఈ సినిమా షూటింగ్ అవ్వ‌గానే.. పెళ్లి ఉండొచ్చు.

ALSO READ: తొలి ఎపిసోడ్ కే హిట్టు కొట్టేశాడు