ENGLISH

క‌త్తిమ‌హేష్ క‌న్నుమూత‌

10 July 2021-17:40 PM

విమ‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌త్తిమ‌హేష్ కొద్దిసేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. రెండు వారాల క్రితం నెల్లూరు ద‌గ్గ‌ర జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తిమ‌హేష్‌కి తీవ్ర గాయాల‌య్యాయి. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని తొలుత చెప్పినా, కోలుకుంటున్నార‌ని, ఐసీయూ నుంచి కూడా వైద్యులు డిశ్చార్జీ చేశార‌ని స‌న్నిహితులు చెబుతూ వ‌చ్చారు.

 

క‌త్తిమ‌హేష్ ఆరోగ్యం కుదుట‌ప‌డింద‌ని అనుకున్నారంతా. అయితే రెండు రోజులుగా మ‌హేష్ ఆరోగ్యం విష‌మించింద‌ని, ఆయ‌న శరీరం చికిత్స‌కు స‌హ‌క‌రించ‌లేదని స‌న్నిహితులు చెబుతున్నారు. వైద్యులు విశ్వ ప్ర‌య‌త్నం చేసినా, స‌న్నిహితులు ఎంతైనా ఖ‌ర్చు పెట్ట‌డానికి సిద్ధ‌మైనా.. ఆయన ప్రాణాల్ని కాపాడ‌లేక‌పోయారు. విమ‌ర్శ‌కుడిగా చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన క‌త్తి మ‌హేష్ `పెస‌రెట్టు` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. కొన్ని చిత్రాల్లోనూ న‌టించారు.

ALSO READ: జులై కూడా ఖాళీ... ఆగ‌స్టులోనే హ‌డావుడి