ENGLISH

టాలీవుడ్ కి గుడ్ న్యూస్‌!

08 November 2020-13:09 PM

తెలుగు చిత్ర‌సీమ‌కు ఇదో శుభ‌వార్త‌! త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో థియేట‌ర్లు తెర‌చుకోబోతున్నాయి. ఇందుకు సంబంధించి కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాల్ని ఇచ్చారు. అన్ లాన్ నిబంధ‌న‌ల మేర‌కు... షూటింగులు మొద‌ల‌య్యాయ‌ని, ఇక థియేట‌ర్లూ తెర‌చుకోవ‌చ్చ‌ని కేసీఆర్ అనుమ‌తులు ఇచ్చేశారు. అంతేకాదు... హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సినీ స్టూడియో నిర్మిస్తామ‌ని, ఏకంగా 2వేల ఎక‌రాల్లో ఈ స్టూడియో నిర్మాణం చేప‌డ‌తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. టాలీవుడ్ నుంచి.. చిరంజీవి, నాగార్జున‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని ప్ర‌త్యేకంగా క‌లుసుకున్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ఈ వ‌రాలు అందించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 2 వేల ఎక‌రాల్లో స్టూడియో నిర్మిస్తే - క‌చ్చితంగా భాగ్య‌న‌గ‌రానికి అదో మ‌ణిహారం అవుతుంది.

ALSO READ: మిస్ ఇండియాపై ఓ మ‌ర‌క‌..!