ENGLISH

సీత‌కు.. మ‌రో ఆప్ష‌న్ దొరికింది!

26 August 2020-10:00 AM

`ఆది పురుష్‌`కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చ‌క చక సాగుతున్నాయి. ఈ సినిమాని ఎట్టిప‌రిస్థితుల్లోనూ 2021 మార్చిలోగా మొద‌లెట్టాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. స్క్రిప్టు ప‌నులు ఎప్పుడో మొద‌లైపోయాయి. ఇప్పుడు న‌టీన‌టుల్ని ఎంపిక చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ప్ర‌తినాయ‌కుడిగా సైఫ్ అలీఖాన్ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. సీత పాత్ర‌లో ఎవ‌రిని తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

 

ప్ర‌భాస్ అభిమానులు అనుష్క పేరు జ‌పిస్తున్నారు. ద‌ర్శ‌కుడు మాత్రం... సీత పాత్ర‌కు కీర్తి సురేష్ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి బాలీవుడ్ ట‌చ్ ఇవ్వాలంటే.. క‌థానాయిక‌నీ అక్క‌డి నుంచే తీసుకోవాలి. అలాగైతే.. సీత పాత్ర కైరా అద్వాణీకి దక్కే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. కైరా అయితే టాలీవుడ్ కీ ప‌రిచ‌య‌మే. ప్ర‌భాస్ ప‌క్క‌న జోడీ బాగుంటుంది. అందుకే... కీర్తి ని తీసుకొనే ఛాన్స్ లేక‌పోతే, కైరాని ఎంచుకోవాల‌ని భావిస్తున్నార్ట‌. ఈ విష‌యంలో త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది.

ALSO READ: Keerthi Suresh Latest Photoshoot