ENGLISH

కీర్తి సురేష్‌ మొదలెట్టేసింది

11 March 2017-13:49 PM

ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ గురించి తెలియని వాళ్లెంత మంది చెప్పండి. అమ్మడు తెలుగు తెరకు పరిచయమై చాలా తక్కువ కాలమే అయినప్పటికీ, అందరికీ సుపరిచితురాలైపోయింది ఆకట్టుకునే తన నటనతో. అందుకే గొప్ప గొప్ఫ ఆఫర్స్‌ దక్కించుకుంటూ రేస్‌లో జోరుగా దూసుకెళ్లిపోతోంది. సక్సెస్‌కి సీనియారిటీతో పని లేదనే నీతి సూత్రం కూడా చెప్పేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనూ, తమిళంలోనూ కూడా స్టార్‌ హీరోల బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే మహానటి సావిత్రి బయోపిక్‌తో మన ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. బైలింగ్వల్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహానటి సావిత్రి పాత్రలో నటించడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఈ భామ ఆ పాత్రలో తనను తాను ఊహించుకుంటూ, ఆ పాత్ర కోసం సర్వ సన్నిద్ధమవుతోంది. అందుకోసం పాత సినిమాలు తెగ చూసేస్తోందట. సావిత్రి పాత్రలో తనకు దక్కిన ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకునేందుకు చేయాల్సిన కసరత్తులన్నీ చేసేస్తోందట ఈ ముద్దుగుమ్మ. మరో పక్క ఈ భామ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ కూడా దక్కించేసుకుంది అతి తక్కువ టైంలోనే. కొరటాల శివ - మహేష్‌బాబు సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్‌ అని సమాచారమ్‌. అన్నట్లు ఈ సినిమాలో ముద్దుగుమ్మ సమంత కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ALSO READ: బాహుబలి 2 ట్రైలర్ కి సమయం ఆసన్నమయింది...