ENGLISH

క‌నీసం ఐటెమ్ సాంగ్ అయినా చేయిద్దామ‌ని...!

09 September 2020-09:00 AM

మ‌హేష్ బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా - `స‌ర్కారు వారి పాట‌`. త్వ‌ర‌లోనే అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. క‌థానాయిక‌గా కీర్తి సురేష్ దాదాపుగా ఖాయం. అయితే.. ఈ సినిమా కోసం కైరా అడ్వాణీని తీసుకుందామ‌నుకుంది చిత్ర‌బృందం. `భ‌ర‌త్ అనే నేను`లో కైరా క‌థానాయిక‌గా న‌టించింది. ఆ సెంటిమెంట్ తోనే, ఈ సినిమాలోనూ కైరాని ఎంచుకోవాల‌ని భావించారు.

 

అయితే కైరా ఈ సినిమా ఒప్పుకోలేదు. కాల్సీట్ల స‌మ‌స్య వ‌ల్ల `నో` చెప్పింది. అలాగ‌ని సెంటిమెంట్ ని వ‌దులుకోవ‌డం మ‌హేష్ అండ్ కోకి న‌చ్చ‌డం లేదు. ఎలాగైనా స‌రే, ఈ సినిమాలో కైరాని ఇరికించాల‌ని భావిస్తోంది. కనీసం కైరాతో ఐటెమ్ సాంగ్ అయినా చేయించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నార్ట‌. అదీ కుద‌ర‌ని ప‌క్షంలో.. చిన్న గెస్ట్ రోల్ అయినా... చేయిద్దామ‌ని భావిస్తున్నారు. మ‌రి కైరా సై అంటుందో, లేదో చూడాలి.

ALSO READ: జయప్రకాష్‌రెడ్డి.. నటుడు మాత్రమే కాదు.!