ENGLISH

24 గంట‌ల్లోనే కిర్రెక్కించిన క్రాక్‌

08 February 2021-12:46 PM

ఇప్పుడు వినోద‌మంతా... నెట్టింటిలోనే. విడుద‌లైన రెండు వారాల‌కే... కొత్త సినిమాలు సైతం ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుద‌లైన `క్రాక్‌` ఇప్ప‌టికే ఆహాలో విడుద‌లైపోయింది. ర‌వితేజ ని మ‌ళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా, ర‌వితేజ బ్రాండ్ మూవీగా.. క్రాక్ నిల‌బ‌డిపోయి, ఈసంక్రాంతి విన్న‌ర్ గా నిలిచింది. ఇప్పుడు ఆహాలో ఈ సినిమాని పెట్టేశారు. అక్క‌డ కూడా... క్రాక్.. కిర్ర‌కెక్కిస్తోంది.

 

తొలి 24 గంట‌ల్లోనే.. 22 మిలియ‌న్ మినిట్స్ వ్యూస్ ని సంపాదించుకుంది. ఆహాలో చాలా సినిమాలు వ‌చ్చినా.. తొలి భారీ హిట్ సినిమా ఇదే. క్రాక్‌ని ఆహా భారీ రేటుకే కొంది. దానికి త‌గిన ఫ‌లితం తొలి రోజే అందుకోగ‌లిగింది. ఈ సినిమా ద్వారా.. ఆహాకి కొత్త స‌బ్ స్క్రైబ‌ర్లు కూడా పెరిగార‌ని తెలుస్తోంది. మొత్తానికి ర‌వితేజ వ‌ల్ల ఆహాకి కొత్త కిక్ వ‌చ్చింది. ఇక‌నైనా ఆహా.. మ‌ల‌యాళ డ‌బ్బింగుల‌పై ఆధార‌ప‌డ‌కుండా... కొన్ని డ‌బ్బులు ఎక్కువ పెట్టి, తెలుగు స్ట్ర‌యిట్ సినిమాల‌పై దృష్టి పెడుతుందేమో చూడాలి.

ALSO READ: శంక‌ర్ మెగా ఫ్యామిలీని ఏం చేయ‌బోతున్నాడు?