ENGLISH

క్రిష్ చెబుతున్న ‘9 అవర్స్‌’ రాబరీ కథ

24 May 2022-12:00 PM

దర్శకుడు క్రిష్ మంచి కథకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తెరకెక్కించాలానే ఉద్దేశంలో నిర్మాతగా కూడా మారారు.. ఇప్పుడు క్రిష్ కథతో ఒక వెబ్ సిరిస్ వస్తుంది. క్రిష్ అందించిన కథతో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌ ‘9 అవర్స్‌’. తారకరత్న ప్రధాన పాత్ర పోషించారు. అజయ్‌, మధుశాలిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

 

తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదో బ్యాంకు రోబరీ కథ. ‘డెక్కన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌’ని కొందరు దుండగులు ఆధీనంలో తీసుకొని రాబరికీ పాల్పడతారు. తర్వాత పోలీసులకు, రోబరి చేసిన వారికి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది ట్రైలర్ లో గ్రిప్పింగా చూపించారు. నిరంజన్‌ కౌశిక్‌, జాకబ్‌ వర్గీస్‌లు దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌కు వై.రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌2వ తేదీ నుంచి డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.