ENGLISH

నాగ‌ల‌క్ష్మి వ‌చ్చేసింది

18 November 2021-11:20 AM

ఉప్పెన‌తో ఒక్క‌సారిగా ఫేమ్ లోకి వ‌చ్చేసింది కృతి శెట్టి. ఆ త‌ర‌వాత‌... త‌న‌కు గంపెడు అవ‌కాశాలు వ‌చ్చాయి. స్టార్ హీరోయిన్ల సినిమాలోనూ ఛాన్స్ ద‌క్కించుకుంటోంది. అయితే... కృతి న‌టించిన ఒక్క సినిమా కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల కాలేదు. ఇప్పుడు త‌న‌కు సంబంధించిన లుక్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య క‌ల‌సి న‌టిస్తున్న చిత్రం `బంగార్రాజు`. చైతూ సరసన కథానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో కృతి పాత్ర పేరు.. నాగ‌ల‌క్ష్మి. ఆ పాత్ర‌కు సంబంధించిన లుక్ ఈరోజు బ‌య‌ట‌కు వ‌దిలారు.

 

చీర‌క‌ట్టుతో మెరిసిపోతూ.. మెడలో దండలతో రివీలైన ఆమె మేకోవర్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి నాగార్జున ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

ALSO READ: శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్ రివ్యూ: నాని న‌యా అవ‌తార్‌