ENGLISH

షీ ఈజ్‌ బోల్డ్‌: 'జూలీ-2' ట్రైలరొచ్చేస్తోంది

01 September 2017-16:51 PM

లక్ష్మీరాయ్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం 'జూలీ-2' ట్రైలరొచ్చేస్తోంది. సెప్టెంబర్‌ 4న ట్రైలర్‌ విడుదల కానుంది. అక్టోబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. టీజర్‌తో ఇప్పటికే హీటెక్కించేసిన లక్ష్మీ రాయ్‌, ట్రైలర్‌తో ఇంకో సంచలనానికి సిద్ధమవుతోందిట. టీజర్‌ చూసిన ఆడియన్స్‌, ట్రైలర్స్‌ కోసం చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ఇదొక ఎరోటిక్‌ థ్రిల్లర్‌. అడల్ట్‌ కంటెంట్‌ అనే తరహాలో శృంగార సన్నివేశాల్ని తెరకెక్కించారు. అలాగే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా అద్భుతంగా చిత్రీకరించినట్లు టీజర్‌తోనే తేలింది. వాటన్నిటికీ మించిన ఎమోషనల్‌ డ్రామా సినిమాలో ఉంటుందట. టీజర్‌ వచ్చాక తనను ఆశీర్వదించినవారంతా, ట్రైలర్‌ తర్వాత కూడా ఆశీర్వదించాలని కోరుతోంది లక్ష్మీరాయ్‌. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌ మీదనే ఇదొక అద్భుతమైన ఎరోటిక్‌ థ్రిల్లర్‌గా గుర్తింపు తెచ్చుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది ఈ బ్యూటీ. గతంలో నేహా ధూపియా హీరోయిన్‌గా తెరకెక్కిన 'జూలీ' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌. ఆమెని ఏరి కోరి ఈ సినిమాకి ఎంచుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి ఒళ్లు తగ్గించి, స్లిమ్‌గా మారింది రాయ్‌ లక్ష్మీ. తన కష్టం ఫలించి, ఈ సినిమా తనకి కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుందని ఆశిస్తోంది. దీపక్‌ శివదాసాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్