ENGLISH

లావణ్య ఈజ్‌ ట్రూ 'ఇంటెలిజెంట్‌'

19 July 2018-15:39 PM

'అందాల రాక్షసి' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిందీ భామ. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్‌', సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలతో వరుస హిట్లు సొంతం చేసుకుంది. అక్కడితో లావణ్య దశ తిరిగిపోయినట్లే అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఆమె కెరీర్‌కి మళ్లీ బ్రేకులు పడ్డాయి. 

'మిస్టర్‌', 'ఉన్నది ఒక్కటే జిందగీ', 'ఇంటెలిజెంట్‌' సినిమాలతో వరుస ఫెయిల్యూర్స్‌ చవి చూసింది. దాంతో అమ్మడు రేస్‌లో మళ్లీ వెనకబడిపోయింది. ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్స్‌ సొంతం చేసుకుంటోందీ ముద్దుగుమ్మ. మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో 'అంతరిక్షం' సినిమాలో నటిస్తోంది. అలాగే యంగ్‌ హీరో నిఖిల్‌ కొత్త చిత్రం 'ముద్ర'లోనూ లావణ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ తరుణంలో అమ్మడు టాలీవుడ్‌కి టాటా బైబై చెప్పేస్తుందట. త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. 

ఈ వార్తల్ని ఖండిస్తూ, ముద్దుగుమ్మ లావణ్య ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. కేవలం బాలీవుడ్‌కే కాదు, తెలుగుతో పాటు, అన్ని రకాల భాషల్లోనూ అవకాశాల కోసం ట్రై చేస్తున్నానని తెలివిగా చెప్పుకొచ్చిందీ అందాల రాక్షసి. ప్రస్తుతం 'అంతరిక్షం', 'ముద్ర' సినిమాలు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. 

చూడాలిక వరుణ్‌, నిఖిల్‌ సినిమాలతో లావణ్యకు అదృష్టం తిరిగొస్తుందేమో.!

ALSO READ: బిగ్ బాస్ సభ్యులకి, వీక్షకులకి షాక్ ఇచ్చిన ప్రదీప్