ఎన్ని సినిమాలు చేసినా లావణ్య త్రిపాఠిని 'అందాల రాక్షసి' అనే ముద్దుగా పిలుచుకుంటారు. తొలి సినిమా 'అందాల రాక్షసి'తో ఆమె తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయింది. వెండితెరపై హాట్ అప్పీల్ పండించడంలో లావణ్య ఎప్పుడూ మొహమాటపడలేదు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకోసం చీరకట్టులో ఎంతగా హొయలొలికించేసిందో చూశాం. 'భలే భలే మగాడివోయ్' సినిమా పాటల్లో మోడ్రన్ దుస్తుల్లో ఓవర్ డోస్ గ్లామర్‌తోనూ రెచ్చిపోయింది. అయితే సినిమాల్లో తన సంప్రదాయ లుక్ బోర్ కొట్టేసిందని వాపోతోంది ఈ బ్యూటీ. అంతలోనే లావణ్య నుంచి ఓ హాట్ ఫొటో బయటకు వచ్చింది. నాగచైతన్య హీరోగా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన స్టిల్ అది. సెట్స్‌లో తీసిన ఫొటోస్‌లో అది కూడా ఒకటి. రెండు ఫొటోల్లో లావణ్య హాట్ హాట్‌గా కనిపించింది. మోడ్రన్ దుస్తుల్లో లావణ్యని ఇలా చూడటం ఇదే తొలిసారి కాకపోయినా ఇప్పటిదాకా అలాంటి కాస్ట్యూమ్స్ పాటలకే పరిమితం చేసిన ఈ బ్యూటీ, సినిమాలో కూడా అవే మోడ్రన్ ఔట్‌ఫిట్స్‌తో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏదేమైనా ఈ ఫొటోలిప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయాయి. ఇదిలా ఉండగా లావణ్య నటించిన 'మిస్టర్' సినిమా నేడే విడుదలవుతోంది. వరుణ్ తేజ ఈ సినిమాలో హీరో. హెబ్బా పటేల్ మోడ్రన్‌గా హాట్ లుక్‌తో అదరగొట్టేస్తోంటే, లావణ్య మాత్రం ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్‌తో కనిపిస్తోంది.