ENGLISH

‘లైగర్‌’ టీంతో కలిసి భారతీయ వంటకాలను టేస్ట్ చేసిన మైక్ టైసన్

17 November 2021-16:46 PM

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే అంచనాలు ఆకాశన్నంటాయి. నిన్న అమెరికాలో ప్రారంభించిన కొత్త షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ అయ్యారు.

 

మైక్ టైసన్‌ సింప్లిసిటీ చూసి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లతో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఆశ్చర్యపోయింది. మైక్ టైసన్ మన భారతీయ వంటకాలను మెచ్చుకున్నారు. ఆయనకు ఎంతో ఇష్టమైన వంటకాల గురించి అడిగారు. మైక్ టైసన్, ఆయన భార్య కికి కోసం స్పెషల్‌గా భోజన ఏర్పాటు చేసింది లైగర్ టీం.

 

గార్లిక్ నాన్, బట‌ర్ చికెన్, తందూరి చికెన్, ఫిష్ టిక్కా మసాలా, గోట్ బిర్యానీ లాంటి స్పెషల్ ఐటమ్స్‌తో లంచ్ ఏర్పాటు చేశారు. ఆలూ గోబీ, పాలక్ పన్నీర్, సమోస, కబాబ్స్‌లను మైక్ టైసన్ స్పెషల్‌గా అడిగార‌ట‌. ఇండియన్ వంటకాల మీద టైసన్‌కు ఉన్న మక్కువ చూసి చిత్రయూనిట్ ఆశ్చర్యపోయింది. చిత్రయూనిట్ ప్రేమగా వడ్డించడం, అతిథి మర్యాదలను చూసి మైక్ టైసన్ ముచ్చటపడ్డారు.

 

సెట్స్ మీద మైక్ టైసన్ సంపూర్ణ సహాకారమందించారు. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, అనన్య పాండే, ఛార్మీలు కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌లో అందరూ నవ్వులు చిందిస్తున్నారు. వారంతా ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

 

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.

 

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ALSO READ: మ‌హేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా?