శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. థియేటర్ల పరిస్థితి బాగోకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
ఈ లోగా ఈ సినిమాకి మళ్లీ రీషూట్లు మొదలెట్టినట్టు టాక్. కొన్ని సన్నివేశాల్ని ఇంకా బెటర్ గా తీయాలన్న ఉద్దేశ్యంతో రీషూట్ జరుపుతున్నార్ట. కేవలం 10 రోజుల్లో ఈ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాకి సెన్సార్ జరిగింది. రీషూట్లు చేసి, మార్పులు చేస్తే - మరోసారి సెన్సార్ ముందుకు వెళ్లాల్సిందే. అక్టోబరులో లవ్ స్టోరీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అప్పటికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఇలా రిపేర్లు మొదలెట్టారు.
ALSO READ: జగన్ తో చిరు భేటి.. డేట్ ఫిక్స్