ENGLISH

గీత ర‌చయిత వెన్నెల‌కంటి క‌న్నుమూత‌

05 January 2021-17:38 PM

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత వెన్నెల‌కంటి క‌న్నుమూశారు. గుండెపోటుతో ఆయ‌న తుదిశ్వాస విడిచార‌ని స‌మాచారం అందుతోంది. మ‌హ‌ర్షి లాంటి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ఆయ‌న పాట‌లు రాశారు. దాదాపు 2 వేల గీతాలు ఆయ‌న‌క లం నుంచి జాలు వారాయి. ఎన్నో వందల డ‌బ్బింగ్ చిత్రాల‌కు ఆయ‌న సంభాష‌ణ‌లు అందించారు. క‌మ‌ల్ హాస‌న్ సినిమా అంటే.. తెలుగులో మాట‌లు - పాట‌లు రాసే బాధ్య‌త వెన్నెల కంటిదే.

 

వెన్నెల‌కంటి పూర్తి పేరు.. వెన్నెల‌కంటి రాజేశ్వ‌ర ప్ర‌సాద్‌. బిరియానీ, ఆకాశ‌మంత‌, ఒక్క మ‌గాడు, ట‌క్క‌రి దొంగ‌, న‌ర‌సింహ నాయుడు, అన్న‌య్య‌, స‌మ‌ర సింహారెడ్డి, శీను, అల్ల‌రి ప్రియుడు, స్వాతి కిర‌ణం, ఆదిత్య 369, చెట్టు కింద ప్లీడ‌రు, ఏప్రిల్ 1 విడుద‌ల‌.. ఇలాంటి హిట్ చిత్రాల‌కు ఆయ‌న గీతాలు అందించారు. కుమారులు శ‌శాంక్ వెన్నెల‌కంటి, రాకేందు మౌళి కూడా గీత ర‌చ‌యితలుగా స్థిర‌ప‌డుతున్నారు.

ALSO READ: 'మాస్ట‌ర్‌' గారికి కొత్త టెన్ష‌న్‌