ENGLISH

హేమ‌పై న‌రేష్‌ గ‌ర‌మ్ గ‌ర‌మ్‌... క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌

09 August 2021-12:30 PM

మా అధ్య‌క్షుడు న‌రేష్ పై ఇటీవ‌ల హేమ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. న‌రేష్ `మా` కుర్చీని వ‌ద‌ల్లేక‌పోతున్నార‌ని, అందుకే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని, మా నిధులు రూ. 3 కోట్లు అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు పెట్టార‌ని తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై న‌రేష్ స్పందించారు. హేమ వ్యాఖ్య‌ల్ని త‌ప్పుబ‌ట్టారు. హేమ కామెంట్లు `మా` స‌భ్యుల్ని గంద‌ర‌గోళ ప‌రుస్తున్నాయ‌ని, మా ప్రతిష్ట‌కు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని, ఆమెపై క్ర‌మ‌శిక్ష‌ణ సంఘానికి ఫిర్యాదు చేస్తాన‌న్నారు న‌రేష్. దీనిపై జీవిత కూడా స్పందించారు.

 

``మాలో నిధుల్ని కేవ‌లం మా స‌భ్యుల కోసం ఖ‌ర్చు పెట్టాం. ఎవ‌రి జేబుల్లోనూ వేసుకోలేదు. స‌భ్యుల ప్రాణాలు పోతుంటే, చూస్తే కూర్చోలేం క‌దా. అందుకే... మా నిధుల్ని వాళ్ల కోసం కేటాయించాం. ఇందులో త‌ప్పేముంది`` అని జీవిత వ్యాఖ్యానించారు. `మా` ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన స‌మ‌యంలోనే జ‌రుగుతాయ‌ని, ఇటీవ‌ల అంత‌ర్గ‌త స‌మావేశంలో కొన్ని స‌ల‌హాలూ, సూచ‌న‌లు ఇచ్చి పుచ్చుకున్నామ‌ని, దానికి త‌గ్గ‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తామ‌ని జీవిత స్ప‌ష్టం చేశారు.

ALSO READ: అయ్యో.. శార‌ద‌ని కూడా చంపేశారే..?