ENGLISH

ఇళయరాజా తీరు మారదా?

24 May 2024-13:52 PM

ఇళయరాజా పేరు చెప్పగానే మనసుకి హాయి గొలిపే సంగీతం  గుర్తుకు వస్తుంది. సౌత్ లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాడు ఇళయరాజా. 80, 90 లలో అన్ని సినిమాలు ఇళయరాజావే. నేటి తరం కూడా రాజు గారి పాటలనే తమ కలక్షన్స్ లో పెట్టుకున్నారు  ఇంత పేరు ప్రఖ్యాతలు పొందిన ఇళయ రాజా ఈ మధ్య వరస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఒకప్పుడు ఇళయరాజా పేరు చెబితే కమ్మని పాటలు జ్ఞప్తికి వచ్చేవి, కానీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రసుగా మారిపోయారు. SP బాల సుబ్రహ్మణ్యం, ఇళయరాజా కాంబో చాలా ఫేమస్, బాలు లేని మ్యాస్ట్రో పాట లేదు. ఇళయరాజా సంగీతానికి బాలు జీవం పోసాడు. వీరిద్దరిది హిట్ కాంబో, అలాంటి వీరి మధ్య కూడా వివాదాలు చెలరేగాయి. చివరికి బాలు చనిపోయేనాటికి కూడా ఆ వివాదాలు సద్దుమణిగింది లేదు. 


రీసెంట్ గా రజినీకాంత్ కొత్త మూవీ కూలీ పై కేసు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇళయరాజా "తంగ మగన్" సినిమాలో స్వరపర్చిన "వా వా పక్కం వా" అనే పాటను రజనీ కూలి సినిమాలో వాడుకున్నందుకు రజనీకాంత్ నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపించాడు ఇళయరాజా. ఇపుడు మళయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ మూవీ యూనిట్  పై కేస్ ఫైల్ చేసాడు ఇళయరాజా. ఈ మూవీ మలయాళంలో ఫిబ్రవరీలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ సాధించింది. వసూళ్లు పరంగా కూడా ది బెస్ట్ గా నిలిచింది. మొదటి సారిగా  ఒక మలయాళం మూవీ కోట్ల క్లబ్ లో చేరింది. తరవాత తెలుగు తమిళం భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో సృష్టించిన గుణ కేవ్స్, గుణ సినిమలో కమ్మని నీ ప్రేమలేఖలే అనే పాట మంజుమ్మల్ బాయ్స్ లో వాడారు. ఈ సినిమా హిట్ అవటానికి కారణం ఆ పాటే అని, ఆ పాట తనది అని , తన అనుమతి తీసుకోకుండా ఆ పాటని సినిమాలో ఎలా వాడతారని రాజు గారు నోటీస్ పంపారు. 


కానీ మూవీ యూనిట్ వెర్షన్ వేరేలాఉంది. తాము ఆ పాట ఆడియో రైట్స్ ఉన్న మ్యూజిక్ కంపెనీ దగ్గర పర్మిషన్ తీసుకున్నామని వెల్లడించారు. అందుకనే ఇళయరాజా ని మళ్ళీ పర్మిషన్ తీసుకోలేదని చెప్తున్నారు. మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం చేసుకోవటం వలన సమస్య రాదని కమ్మనీ నీ ప్రేమలేఖేలే పాటను సినిమాలో చాలా సార్లు వాడారు. దీనితో ఇళయరాజా అహం  దెబ్బతింది. మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్‌ కు ఇళయరాజా తరపున లాయర్ లీగల్ నోటీసులు పంపించారు. ఇళయరాజా కేసు గెలిస్తే సినిమాలో పాట తీసేయాల్సి వస్తుంది. దీనితో మూవీలో సోల్ మిస్ అవుతుంది. తొందరగా ఈ వివాదం పరిష్కారం కావాలని మూవీ ఫాన్స్ కోరుకుంటున్నారు.