సెప్టెంబరు 10న... టాలీవుడ్ లో ముక్కోణపు పోటీ ఎదురుకానుంది. ఓ వైపు థియేటర్లలో.. `లవ్ స్టోరీ` విడుదల అవుతోంటే, మరోవైపు ఓటీటీలో `టక్ జగదీష్`, `మాస్ట్రో` రిలీజ్‌కి రెడీ అయ్యాయి. టక్ జగదీష్ అమేజాన్ ప్రైమ్ లోనూ.. మాస్ట్రో హాట్ స్టార్ లోనూ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే... లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల అవుతున్న నేపథ్యంలో.. ఓటీటీ సినిమాలు మరో డేట్ చూసుకోవాలన్న విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి. థియేటర్ వ్యవస్థ నిలబడాలంటే.. లవ్ స్టోరీకి దారివ్వాలంటూ కొంతమంది సినీ ఎగ్జిబీటర్లు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మాస్ట్రో విడుదల వాయిదా పడింది. ఈ సినిమాని ఇప్పుడు సెప్టెంబరు 17న విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్సయ్యింది. నితిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ లో విజయం అందుకున్న అంధాధూన్‌కి ఇది రీమేక్. తమన్నా, నభానటేషా కథానాయికలుగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. దాదాపు 32 కోట్లకు ఈసినిమాని హాట్ స్టార్ కొనుగోలు చేసింది. నిజానికి హాట్ స్టార్ ఓ డేట్ ఫిక్సయితే.. దాన్ని మార్చడం చాలా కష్టం. కానీ నిర్మాతల ఒత్తిడి మేరకు... హాట్ స్టార్‌రిలీజ్ డేట్ మార్చుకుంది. మరి టక్ జగదీష్ ఏం చేస్తాడో?
ALSO READ: 'వివాహ భోజనంబు' రివ్యూ & రేటింగ్!