ENGLISH

మ‌హా స‌ముద్రం టార్గెట్ ఎంత‌?

14 October 2021-11:00 AM

శ‌ర్వానంద్ కి గ‌త కొంత కాలంగా ఏదీ క‌ల‌సి రావ‌డం లేదు. త‌న సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడో హిట్ కొట్ట‌డం చాలా అవ‌స‌రం. త‌న ఆశ‌ల‌న్నీ `మ‌హా స‌ముద్రం`పైనే ఉన్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా గురువారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పండ‌గ సీజ‌న్ కాబ‌ట్టి... ఈ నాలుగు రోజులూ మంచి వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే... ఈ సినిమా టార్గెట్ కూడా పెద్ద‌దే. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 17 కోట్ల‌కు థియేట‌రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయి.

 

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 18 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు రావాలి. నైజాంలో ఈ సినిమా 5.50 కోట్ల‌కు అమ్ముడైంది. సీడెడ్ నుంచి రెండున్నర కోట్లు, ఓవ‌ర్సీస్ రైట్స్ రూపంలో 1.4 కోట్లు వ‌చ్చాయి. ఉత్త‌రాంధ్ర‌, ఈస్ట్, వెస్ట్ లో కూడా ఈ సినిమా బాగానే అమ్ముడైంది. అయితే ఇటీవ‌ల ఏపీ నుంచి స‌రైన వ‌సూళ్లు రావ‌డం లేదు. అక్క‌డ సినిమాలు చూసే మూడ్ అంత‌గా లేన‌ట్టే క‌నిపిస్తోంది.

 

కాక‌పోతే ద‌స‌రా సీజ‌న్ నుంచి 100 శాతం ఆక్యుపెన్సీకి ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డం శుభ‌శూచ‌కం. మ‌హా స‌ముద్రం మాస్ సినిమా కాబ‌ట్టి, ఓపెన్సింగ్ బాగానే రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. కాక‌పోతే... శుక్ర‌వారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ అవుతోంది. ఆ పోటీ నుంచి మ‌హా స‌ముద్రం త‌ట్టుకోవాలి.

ALSO READ: ఈసారి ఓట్లు కూడా రావు: న‌రేష్ ఘాటు వ్యాఖ్య‌లు