ENGLISH

సూపర్‌ స్టార్‌ విత్‌ సూపర్‌ స్టార్‌

30 August 2017-18:43 PM

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంతవరకు సూపర్‌ స్టార్‌ అంటే ఘట్టమనేని కృష్ణ మాత్రమే. 300లకు పైగా చిత్రాల్లో నటించి, కృష్ణ టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అయ్యారు. ఆయన తనయుడిగా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని మహేష్‌ బాబు సంపాదించుకున్నాడు. తండ్రి లెగసీని కొనసాగించడం చిన్న విషయం కాదు. అయితే తండ్రితో పోటీ పడి ఎక్కువ సినిమాలు చేయలేకపోయినా స్టార్‌డమ్‌ విషయంలో మహేష్‌ తండ్రిని మించిన తనయుడనిపించుకోవడం గమనించదగ్గది. 'నాని' సినిమాలో మహేష్‌ ఓ గెటప్‌లో అచ్చంగా తండ్రి కృష్ణను తలపిస్తాడు. ఇక్కడ ఈ ఫొటోలో కూడా తండ్రి, కొడుకులు అచ్చం ఒకేలా ఉన్నారు. మహేష్‌ సతీమణి నమ్రత తన మావగారు కృష్ణ ఫొటోనీ, తన భర్త మహేష్‌ ఫొటోనీ ఇలా జాయిన్‌ చేసి సోషల్‌ మీడియాలో ఉంచింది. సేమ్‌ టు సేమ్‌ సూపర్‌ స్టార్స్‌ ఇద్దరూ ఒకేలా ఉన్నారు కదా? ఈ ఫోటోని చూసిన సూపర్‌ స్టార్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారులే. ప్రస్తుతం మహేష్‌బాబు 'స్పైడర్‌' సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌ సెట్‌లో దిగిన ఫోటోనే మహేష్‌ది. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మహేష్‌కి చాలా స్పెషల్‌. ఎందుకంటే ఈ సినిమాతో మహేష్‌బాబు తమిళ ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నారు. 'స్పైడర్‌' బైలింగ్వల్‌ మూవీ. తమిళ, తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది. తమిళంలో మహేష్‌బాబు డబ్బింగ్‌ చెప్పుకున్నారు కూడా. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: అర్జున్ రెడ్డి కథని కాపీ కొట్టారా?